మళ్లీ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. ఏ జట్టుకో తెలుసా?

praveen
మరికొన్ని రోజుల్లో మెగా వేలం ప్రారంభం కాబోతోంది. దీంతో ఇక భారత క్రికెట్ ప్రేక్షకులందరూ చూపు ఈ మెగా వేలం పైనే ఉంది. ఒక వైపు ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇస్తూ ఉండడం.. మరోవైపు వేలంలో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ కూడా ఉండడంతో.. మరికొన్ని రోజులలో జరగబోయే మెగా వేలంలో స్టార్ ప్లేయర్స్ ని ఏ ఫ్రాంచైజీ  సొంతం చేసుకోబోతుంది.. ఇక స్టార్ ఆటగాళ్ల కోసం ఎలా పోటీ పడబోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే మొన్నటి వరకు కొన్ని జట్లకు కెప్టెన్గా ఉన్న ఆటగాళ్లను సైతం ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోకుండా వదిలేసాయి.

 అందులో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఢిల్లీ కాపిటల్ జట్టుకు కెప్టెన్సీ వహించి జట్టు ఫైనల్ వరకు తీసుకువెళ్లిన శ్రేయస్ అయ్యర్ ను రిటైన్ చేసుకోకుండా వదిలేసింది ఢిల్లీ ఫ్రాంచైజీ. దీంతో కెప్టెన్గా అనుభవం ఉన్న ఇతని కోసం కొత్తగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఫ్రాంచైజీ లు  పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ తో ఒప్పందం కుదుర్చుకుని ఇక తమ జట్టుకు కెప్టెన్గా మార్చుకునేందుకు ఫిక్స్ అయిందని.. అహ్మదాబాద్ కెప్టెన్గా  శ్రేయస్ అయ్యర్ దాదాపు ఖరారు అయిపోయాడు అంటూ టాక్ వినిపిస్తోంది.

 ఇక అదే సమయంలో ఇక ఇప్పుడు కొత్త వార్త మీదికి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి కాదు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాబోతున్నాడు అంటూ సారాంశం ఉన్న ఒక వార్త అందరినీ ఆకర్షిస్తోంది.  కోల్కతా నైట్రైడర్స్ జట్టు కెప్టెన్గా ఉన్న ఇయాన్ మోర్గాన్ ను ఫ్రాంచైజీ  మెగా పొలంలోకి వదిలేసింది. అయితే ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ తో కోల్కతా ఫ్రాంచైజీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకునిజం ఉంది అన్నది మాత్రం అఫీషియల్  ప్రకటన వచ్చిన తర్వాత క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: