రాజకీయాలు నావల్ల కాదు.. త్వరలో క్లారిటీ ఇస్తా : భజ్జి

praveen
భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో ఎన్నో రికార్డులు సృష్టించాడు హర్భజన్ సింగ్. భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం బౌలర్గా మాత్రమే కాకుండా ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు ఎన్నోసార్లు విజయాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి.  టీం ఇండియాలో ఎన్నో ఏళ్ల పాటు కీలక స్పిన్నర్ గా కొనసాగుతూ తన సత్తా చాటాడు హర్భజన్ సింగ్. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో హర్భజన్ సింగ్ టీమిండియాలో ఎన్నో రికార్డులు సృష్టించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆ తర్వాత టీమిండియా లోకి ఎంతోమంది మణికట్టు స్పిన్నర్లు రావడంతో ఇక హర్భజన్ సింగ్ జట్టులో స్థానం కోల్పోయాడు.

 మళ్లీ పునరాగమనం చేసేందుకు ఎంతగానో ప్రయత్నం చేసాడు. కానీ కుదరలేదు. ఇకపోతే ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ సీనియర్ స్పిన్నర్. అయితే అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత  క్రికెటర్లు ఇటీవలి కాలంలో రాజకీయాల వైపు వెళుతూ ఉండడం గమనార్హం. అంతకుముందు గౌతం గంభీర్ ఇలాగే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన బిజెపి నుండి పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నాడు గౌతం గంభీర్. దీంతో హర్భజన్ సింగ్ కూడా రాజకీయాల వైపు వెల్ల బోతున్నాడు  అని చర్చ జరిగింది. ఇదే సమయంలో ఏ పార్టీలో చేరబోతున్నాడనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.

 ఈ క్రమంలోనే తన భవిష్యత్ కార్యాచరణపై ఇటీవల స్పందించిన హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు హార్భజన్ సింగ్. తనకు తెలిసింది క్రికెట్ ఒక్కటేనని క్రికెట్ తో సంబంధమున్న వ్యవహారాల లోనే కొనసాగుతా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగడం లేదా మెంటర్ గా మారడం అనే విషయం పై త్వరలో క్లారిటీ ఇస్తాను అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే 2016 లో భారత్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన హర్భజన్ సింగ్కు ఆ తర్వాత జట్టులో స్థానం దక్కలేదు. కానీ ఐపీఎల్లో మాత్రం అభిమానులను అలరిస్తోంది వచ్చాడు హార్భజన్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: