క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. ఈ సారిముంబైలోనే మొత్తం ఐపీఎల్ !

Veldandi Saikiran
ఐపీఎల్ 2021 లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా హర్షల్ పటేల్ నిలిచాడు. అయితే గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎనిమినేటర్స్ వరకు చేరుకోవడంలో హర్షల్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ ప్రదాయశాన కారణంగానే అంతర్జాతీయ క్రికెట్ లో కూడా చోటు సంపాదించుకున్నాడు హర్షల్. ఇక తాజాగా ఈ యువ బౌలర్ మాట్లాడుతూ... ఐపీఎల్ 2021 సీజన్ ముందు నేను ఎప్పుడూ డెత్ బౌలింగ్ చేయలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆర్‌సీబీకి ట్రేడ్ అయినప్పుడు.. హోమ్ వర్క్‌లో భాగంగా నా స్కిల్స్‌ను గుర్తించారు. నేను గుడ్ డెత్ బౌలర్‌గా భావించి.. ఆ బాధ్యతలు నాకు అప్పజెప్పారు. అలా నేను డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయ్యా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు పేర్కొన్నారు.
అయితే ఐపీఎల్ 2021 సీజన్ ముందు వేలం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన హర్షల్ పటేల్ ను మళ్ళీ ఐపీఎల్ 2022 కోసం ఆర్‌సీబీ  రిటైన్ చేసుకోలేదు . మెగా వేలం నేపథ్యంలో ఆర్‌సీబీ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది. అయితే తాజాగా ఆర్‌సీబీ తనను రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాన్ని హర్షల్ పటేల్‌ వెల్లడించాడు. జట్టు యాజమాన్యం.... పర్స్ మేనేజ్‌మెంట్ కారణంగానే  తనను రిటైన్ చేసుకోలేదని తెలిపాడు. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆర్‌సీబీ డైరెక్టర్ మైక్ హెస్సన్ తనకి ఫోన్ చేసిమరి ఈ విషయం చెప్పాడని.. తప్పకుండ వేలంలో తీసుకునేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చినట్లు హర్షల్ పటేల్ ప్రకటించాడు. నేను కూడా ఆ జట్టు తరఫున ఆడేందుకు ఇష్టపడుతున్నా. ఎందుకంటే ఆర్‌సీబీ, ఐపీఎల్ 2021 సీజన్ వల్ల నా కెరీర్, జీవితం మొత్తం మారిపోయింది. ఇక వేలం నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ నన్ను ఇప్పటి వరకు సంప్రదించలేదు. అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: