అతనిపై కోహ్లీకి నమ్మకం ఉందో లేదో : దీప్ దాస్

praveen
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మొదటి టెస్టులో అద్భుతంగా సత్తా చాటిన టీమ్ ఇండియా రెండో టెస్టులో మాత్రం తేలిపోయింది. దీంతో ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్న సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1-1 తేడాతో సిరీస్ సమం గా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం జనవరి 11వ తేదీన జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్లో ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది. 3వ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించ బోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. విజయం సాధించి తమ విజయపరంపర కొనసాగించాలని సౌతాఫ్రికా జట్టు భావిస్తోంది.

 అదే సమయంలో మూడవ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని కోహ్లీ సేన దృఢమైన  సంకల్పంతో ఉంది. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో జట్టు ఎంపిక కూడా ఎంతో కీలకం గా మారబోతుంది. అయితే మూడో టెస్ట్ మ్యాచ్ కి ముందు జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న మొహమ్మద్ సిరాజ్ గాయం బారినపడి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో జట్టులోకి ఎవరు రాబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. టెస్ట్ క్రికెట్లో అపార అనుభవం ఉన్న ఇషాంత్ శర్మను జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్ కోహ్లీకి ఇశాంత్ శర్మ పై నమ్మకం ఉందా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 అయితే ఈ విషయంపై ఇటీవలే మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ స్పందించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మపై నమ్మకం ఉందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 2019 వరకు ఇషాంత్ శర్మ నైపుణ్యాలపై కోహ్లీకి నమ్మకం ఉంది. అది ఇప్పుడు ఉందా లేదా అన్నది మాత్రం చెప్పలేను. ఒకవేళ మూడవ టెస్ట్ మ్యాచ్లో సిరాజ్ స్థానంలో ఇషాంత్ శర్మకు  చోటుదక్కింది అంటే ఉమేష్ యాదవ్ కన్నా ఇషాంత్ శర్మ టీమిండియా ఎంతగానో ఉపయోగపడతాడు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఇషాంత్ శర్మ ఎక్కువ హైటు ఉండడంతో ఎంతో వైవిధ్యమైన బంతులు సందించ గలుగుతాడు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను పరుగులు చేయకుండా ఎక్కువసేపు కట్టడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు.  అందుకే పరిస్థితులనుబట్టి ఇక ఇషాంత్ శర్మను టీమిండియా చేస్తుందని భావిస్తున్నాను అంటూ దీప్ దాస్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: