కెప్టెన్ పై కోపాన్ని టీం ఇండియా పై చూపించిన రబడా...?

Veldandi Saikiran
ప్రస్తుతం ఇండియా - సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ లో ఇండియా విజయం సాధించగా... రెండో టెస్టులో సఫారీలు గెలిచాడు. సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలవడంలో.. ఆ జట్టు పేసర్ కగిసో రబడా ముఖ్య పాత్ర పోషించాడు. అయితే మొదటి టెస్ట్‌లో విఫలమైన రబడా రెండో టెస్ట్ లో చెలరేగాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కీలక మూడు వికెట్లు తీసి భారత్ ఓటమికి కారణమయ్యాడు. హాఫ్ సెంచరీలతో క్రీజులో నిలిచిన రహానే, పుజారాలను పెవిలియన్‌కు చేర్చి 111 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రబడా చెలరేగడానికి సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. అతడిని రెచ్చగొట్టాడమే కారణమని తెలుస్తుంది . ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఎల్గరే మీడియాతో పంచుకున్నాడు.
టీం ఇండియా రెండో ఇన్నింగ్స్ ముందు ‘నువ్వు తోపు అనుకుంటే సరిపోదు.. బంతితో చూపించు రబడా' అంటూ అతడిని రెచ్చగొట్టానని ఎల్గర్ తెలిపాడు.మన గ్రూపులో నీ పట్ల అందరికీ గౌరవం, అభిమానం ఉంది. నువ్వు నీ గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావని నేను అనుకోవడం లేదు. బాగా బౌలింగ్‌ చేస్తున్నాననే అతి విశ్వాసంతో ఉంటావని కూడా భావించడం లేదు. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఎప్పుడైతే కేజీ తన ప్రతిభకు తగ్గట్లు రాణిస్తాడో... అప్పుడు తనను మించినోడు ఉండడు.'' అని చెప్పాను. తన సూటి పోటీ మాటలు రబడాపై ప్రభావం చూపాయని, బాగా ఆలోచించి ఉంటాడని, మరుసటి రోజు పక్కా ప్రణాళికతో వచ్చి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడని ఎల్గర్‌ తెలిపాడు. అయితే ఒక్కోసారి రబడా రిలాక్స్‌ అవుతాడని, అలాంటి సమయంలో అతన్ని.. ఈ విధంగా మోటివేట్‌ చేయాల్సి ఉంటుందని ఎల్గర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: