అసలేం జరుగుతోంది.. మరో యువ క్రికెటర్ రిటైర్మెంట్?

praveen
సాధారణంగా క్రికెట్ ఆడే ఆటగాళ్లు ఎక్కువగా ఫిట్నెస్ పై  దృష్టి పెడుతూ ఎక్కువ రోజుల పాటు మూడు ఫార్మాట్లలో కొనసాగాలి అని భావిస్తూ ఉంటారు. మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటి దిగ్గజ క్రికెటర్ గా ఎదగాలి అని భావిస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సార్లు 40 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని ఇష్టం లేకపోయినప్పటికీ ఇక ఫిట్నెస్ సమస్యల కారణంగా రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు 40 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్ల ని చూశాము. కానీ ఇటీవలే శ్రీలంక క్రికెటర్లు మాత్రం వరుసగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. కొంతకాలం నుంచి శ్రీలంక క్రికెట్ లో ప్రతిష్టంభన కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే.

 క్రికెట్ బోర్డు... ఆటగాళ్లకు మధ్య ఒప్పందం విషయంలో చిన్నపాటి వివాదం నడుస్తోంది. గతంలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ప్రతిష్టంభన గురించి  ఆసక్తికర చర్చ జరిగింది.. ఇక ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డు కి వరుసగా షాకులు తగులుతున్నాయి. అద్భుతంగా రాణిస్తున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు వరుసగా  అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండడం సంచలనంగా మారిపోయింది. ఇటీవలే శ్రీలంక క్రికెటర్ రాజకప్ప అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే  రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలంటూ మాజీ ఆటగాళ్లతో పాటు ఎంతోమంది అభిమానులు కూడా కోరారు.

 ఇప్పుడు మరో శ్రీలంక క్రికెటర్ల ఇలాంటి నిర్ణయం తీసుకొని షాక్ ఇచ్చాడు. దనుష్క గుణ తిలక తన టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పటివరకు ధనుష్క గుణ తిలక ఆడింది కేవలం ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే.. చేసింది 299 రన్స్ మాత్రమే. పరిమిత ఓవర్ల ఫార్మాట్ పై దృష్టి పెట్టేందుకు తాను టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను ధనుష్క గుణ తిలక వివరణ ఇచ్చాడు. అయితే 30 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.అయితే బయో బాబుల్ నిబంధనలు ఉల్లంఘించడం తో ముగ్గురు క్రికెటర్లపై  నిషేధం విధించింది శ్రీలంక బోర్డు.. అందులో దనుష్క గుణ తిలక కూడా ఉన్నాడు. ఇటీవలే నిషేధం ఎత్తివేసిన రోజే తన టెస్ట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ ప్లేయర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: