కోహ్లీ స్థానంలో కె.ఎల్.రాహుల్ కాదు.. అతను పర్ఫెక్ట్?

praveen
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా టెస్టు సిరీస్లో మొదటి టెస్టు మ్యాచ్లో గెలిచి జోరు కనబరిచింది. ఇక టీమిండియా జోరు చూస్తే రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా గెలిచి హిస్టరీ క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. రెండో టెస్టు మ్యాచ్ ముందు టీం ఇండియా కి ఎదురు దెబ్బ తగిలింది. వెన్నునొప్పి కారణంగా విరాట్ కోహ్లీ రెండవ టెస్ట్ మ్యాచ్ దూరమయ్యాడు. దీంతో.. వైస్ కెప్టెన్ గా ఉన్న కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని జట్టుకు ముందుకు నడిపించాడు. చివరికి గెలుస్తుంది అనుకున్న మ్యాచ్లో టీమ్ ఇండియాఓడిపోయింది. దీంతో సిరీస్ 1-1 తో సమమైంది. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ విన్నర్ ఎవరో తేల్చే  కీలకమైన మ్యాచ్ గా మారిపోయింది.

 అయితే జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించాడు టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్. విరాట్ కోహ్లీ రెండో టెస్టుకు దూరం కావడంతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటాడని ప్రతి ఒక ఆటగాడి పై దృష్టి సారిస్తాడు అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టిన కేఎల్ రాహుల్ లో మాత్రం ఇలాంటి లక్షణాలు ఎక్కడా కనిపించలేదు అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

 విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వ్యూహాలను రచించడానికి సిద్ధంగా ఉంటాడు. గొప్ప ఎనర్జీతో జట్టును ముందుకు నడిపిస్తాడు అంటూ తెలిపాడు వసీం జాఫర్. అయితే విరాట్ కోహ్లీ స్థానంలో కె.ఎల్.రాహుల్ ను కెప్టెన్గా ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది అంటూ చెప్పుకొచ్చాడు. అజింక్య రహానే ఇలాంటి సీనియర్ బ్యాట్స్మెన్ అందుబాటులో ఉన్నప్పుడు కె.ఎల్.రాహుల్ కు టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించాడు. రహానే సారధ్యంలో భారత జట్టు ఆస్ట్రేలియా లో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేఎల్ రాహుల్ పై వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు.  ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు అతను. అయితే ఇటీవల టెస్టు జట్టులో కోహ్లీ గైర్హాజరు సమయంలో అజింక్య రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: