అతని వల్లే ఓడిపోయాం.. సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్?

praveen
సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుండగా.. మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి అద్భుతంగా రాణించింది టీమిండియా.  ఏకంగా ఆతిథ్య  సౌత్ ఆఫ్రికా జట్టుపై 113 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఇక టీమిండియా అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోయారు. ఈసారి కోహ్లీసేన ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుస్తుంది అని ఎంతో ధీమాతో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే రెండో టెస్టుకు ముందు టీం ఇండియా కి ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టు మ్యాచ్కు దూరమయ్యాడు.

 ఇప్పటికే రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాడు దూరమై ఇబ్బందుల్లో పడ్డ టీమిండియాకు విరాట్ కోహ్లీ కూడా దూరమవడం మైనస్ గా మారిపోయింది. అయితే అటు కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా రెండవ టెస్ట్ మ్యాచ్లో బరిలోకి దిగింది అన్నది తెలిసిందే. ఇక రెండో టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా గెలుస్తుంది అని అనుకున్నప్పటికీ అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు పట్టు బిగించడంతో టీమిండియా బ్యాట్స్మెన్లు చేతులెత్తేసారు. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా  ఓటమి పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జనవరి 11వ తేదీన జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ విజేతను నిర్ణయించే మ్యాచ్ గా మారిపోయింది.

 అయితే రెండో టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా ఓటమి పై ఇటీవలే మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా ఓటమికి భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణం అంటూ ఆరోపించాడు.. కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం కారణంగానే రెండవ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ పరుగులు రాబట్టగలిగాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు సునీల్ గవాస్కర్. సాధారణంగా బంతిని హుక్ చేయని ఎల్గర్ కు రాహుల్ డీప్ లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడం అర్థమే లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ ఎల్గర్ సింగిల్స్ తీస్తూ క్రీజ్లో పాతుకుపోయి జట్టుకు విజయం అందించాడు అంటూ సునీల్ గవాస్కర్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: