క్రిస్ గేల్ ను మరిపించిన యువ కెరటం... కేవలం 65 బంతుల్లో ?

VAMSI
క్రికెట్ అంటే ఇష్టం లేని వారు ఈ కాలంలో ఉంటారంటే నమ్మశక్యం కాదు. ఒకప్పుడు అయితే పెద్దగా ప్రసార మాధ్యమాలు లేక క్రికెట్ లైవ్ అంతగా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు ఎక్కడ ఏ దేశంలో మ్యాచ్ జరిగినా లైవ్ వచ్చేస్తుంది. క్రికెట్ లో రికార్డులు కొత్తేమీ కాదు. నిత్యం ఏదో ఒక రికార్డు వస్తూనే ఉంటుంది. మళ్ళీ దానిని ఎవరో ఒకరు బద్దలు కొడుతూనే ఉంటారు. 20 ఓవర్లు క్రికెట్ వచ్చాక క్రికెట్ మరింతగా మారిపోయింది. ముఖ్యంగా కుర్రాళ్ళు చెలరేగి ఆడుతున్నారు. ఇపుడు ఈ రోజు ఉదయం న్యూజిలాండ్ లో జరిగిన దేశవాళీ టీ 20 క్రికెట్ టోర్నమెంట్ లో పరుగుల వరద పారించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ 20 సునామీ లాంటి ఆటగాళ్లను సైతం వేరు భయపెట్టారని చెప్పాలి. అయితే ఆ మ్యాచ్ ఏమిటో? అసలు ఏమి జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.
న్యూజిలాండ్ లో సూపర్ స్మాష్ 2021-22 టోర్నీ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 21 వ మ్యాచ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ మరియు వెల్లింగ్టన్ జట్ల మధ్య జరిగింది. మొదట టాస్ గెలిచిన వెల్లింగ్టన్ బౌలింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 227 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకుంది. ఇందులో జోష్ క్లార్క్ సన్ అభేద్యంగా 38 బంతుల్లో 76 పరుగులు చేసి భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఇతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు మరియు 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ స్కోర్ ఛేదించడం దాదాపుగా అసాధ్యం అనుకున్నారు. ఇక వెల్లింగ్టన్  కూడా ఇంత స్కోర్ ను సాధిస్తుందని అనుకోని ఉండదు.
అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వెల్లింగ్టన్ మొదటి బంతి నుండే విరుచుకుపడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ మొదటి బంతికి బౌండరీ సాధించినా మూడవ బంతికే అలెన్ ఔటయ్యాడు. ఆ తర్వాత చివరి బంతికి రాబిన్ సన్ అవుట్ అవడంతో వెల్లింగ్టన్ ఆశలన్నీ కరిగిపోయాయి. కానీ ఆ తర్వాత మైఖేల్ బ్రెసెవెల్ క్రీజులోకి రావడంతో సీన్ మారిపోయింది. నెమ్మదిగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అవతలి వైపు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతున్నా ఆఖరి వరకు క్రీజులో ఉండి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బ్రెసెవెల్ ఒక్కడే కేవలం 65 బంతుల్లో 141 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇతని ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు మరియు 11 సిక్సర్లు సాధించాడు. కరేబియన్ వీరుడు క్రిష్ గేల్ ని మరిపించాడని చెప్పవచ్చు. ఈ దెబ్బతో ఇతనికి ఐపీఎల్ లో మంచి ధర పలికే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: