ఐపీఎల్ 15: సెంచరీల వీరుడిపై చెన్నై కన్ను... ?
ఈ సారి ఎక్కువగా యువ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా యువ ఆటగాడు అయిన బెన్ మెక్ డెర్మాట్ ను కొనుగోలు చేయడానికి గత ఏడాది ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ అనుకుంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశవాళ్ళీ టోర్నీ అయిన బిగ్ బాష్ లీగ్ లో మెక్ డెర్మాట్ హోబర్ట్ హర్రికేన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వికెట్ కీపర్ మరియు ఓపెనింగ్ బ్యాట్స్మన్ అయిన ఇతను వరుస సెంచరీలు సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
మాములుగా వన్ డే మ్యాచ్ లో సెంచరీ సాధిస్తేనే ఒక రికార్డు... అలాంటిది టీ 20 మ్యాచ్ లో సెంచరీ మళ్ళీ వెంటనే ఇంకొక సెంచరీ అంటే మాటలు కాదు. అందుకే ఇతనికి ఇపుడు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇతని ఆట తీరును బాగా పరిశీలించిన చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇతనిని కొనుగోలు చేయాలని ఇప్పటికే యాజమాన్యానికి తెలిపాడట. మరి చూద్దాం వేలంలో ఇతని కోసం ఎన్ని ఫ్రాంచైజీలు పోటీ పడుతాయో .