భార‌త్ vs కివిస్ : రెండో టెస్ట్‌లో ఇండియా అఖండ విజ‌యం.. సిరిస్ కైవ‌సం

Paloji Vinay
ముంబై వాంకడే వేధిక‌గా న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ 372 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. 140/5 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కివిస్.. 27 ర‌న్స్ చేసి 5 వికెట్లు పోగొట్టుకుంది. ఆట మొద‌లైన గంట‌లోపే 167 ప‌రుగుల‌కే ఆల్ ఓట్ అయింది. దీంతో భారీ తేడాతో మ్యాచ్ గెల‌వ‌గా 1-0 తో టీమిండియా సిరిస్ కైవ‌సం చేసుకుంది. భార‌త బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, జ‌యంత్ యాద‌వ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్లు 325 ప‌రుగులు చేయ‌గా న్యూజిలాండ్ కేవ‌లం 62 ప‌రుగుల‌కే 10 వికెట్లు కోల్పోయింది.

   ఇక రెండో ఇన్నింగ్స్‌లో 276/7 ప‌రుగులు చేసిన టీమిండియా డిక్లెర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అలాగే  న్యూజిలాండ్ స్పిన్న‌ర్ అజాజ్ ప‌టేల్ 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించినా భార‌త్ బ్యాట్స్‌మెన్స్ మ‌యాంక్ అగ‌ర్వాలు - 150, అక్ష‌ర్ ప‌టేల్ - 52 చేసి మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. అనంత‌రం బ‌రిలోకి దిగిన‌ న్యూజిలాండ్  62 ప‌రుగుల‌కే చేతులెత్తేసి ఆలౌట్ అయింది. ఇంత త‌క్కువ ప‌రుగుల‌కు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో క‌ట్ట‌డి చేయ‌డం ఇదే కావ‌డం విశేషం. భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్ 3 వికెట్లు తీసి టాప్ ఆర్డ‌ర్‌ను  ప‌డ‌గొట్ట‌గా, స్పిన్న‌ర్ అశ్విన్ 4 వికెట్లు, అక్ష‌ర్ 2 వికెట్లు తీసుకోవ‌డం టీమిండియా 263 ప‌రుగ‌లు అధిప‌త్యాన్ని సాధించింది.

 రెండో రోజు మ్యాచ్‌లో కివిస్ స్వ‌ల్ప స్కోరుకే ఆలౌట్ ఫాలోఆన్ చేయాల్సి ఉన్నా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొన‌సాగించింది. రెండో ఇన్నింగ్స్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్‌- 62, పుజారా- 47 క‌లిసి మొద‌టి వికెట్‌కు సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్ చేశారు. ఈ ఇద్ద‌రు వెంట‌వెంట‌నే ఔట‌వ‌డంతో శుభ్‌మ‌న్ గిల్‌-47 పరుగులు చేయ‌గా, కెప్టెన్ విరాట్ కొహ్లీ-36 ప‌రుగులు చేసి రాణించారు. వీళ్లు ఔట్ అయిన త‌రువాత వ‌చ్చిన శ్రేయ‌స్‌-14, సాహా-13 ప‌రుగులు చేసి విఫ‌ల‌మయ్యారు. చివ‌ర్లో వ‌చ్చిన అక్ష‌ర్ ప‌టేల్‌-41 ప‌రుగులు చేసి టిమిండియాకు 276/7 ప‌రుగుల‌కు చేర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: