రోహిత్ కెప్టెన్సీపై.. సచిన్ ఏమన్నాడో తెలుసా?

praveen
మొన్నటి వరకు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా కొనసాగాడు రోహిత్ శర్మ. ఇక తనదైన కెప్టెన్సీతో జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించాడు. ఐపీఎల్ లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఐపీఎల్  5 సార్లు టైటిల్ గెలుచుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. అది కేవలం కెప్టెన్ రోహిత్ శర్మ వల్లే సాధ్యం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా టి20 లకు ఎంతో సమర్థవంతమైన కెప్టెన్ అంటూ నిరూపించుకున్న రోహిత్ శర్మ ఇటీవల ఏకంగాటీమ్ ఇండియా టి 20 జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

 అయితే ఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్ లో కెప్టెన్సీ మార్పు పై చర్చ జరుగుతుంది. విరాట్ కోహ్లీని   కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ స్థానంలో రోహిత్ శర్మ ను నియమించాలి అంటూ డిమాండ్లు పలుమార్లు తెరమీదకు వచ్చాయ్. అలా చేసే ప్రసక్తే లేదు అంటూ బీసీసీఐ పలుమార్లు స్పష్టం చేసింది. కాని అంతలోనే విరాట్ కోహ్లీ షాక్ ఇచ్చాడు. తాను టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ తెలిపాడు. దీంతో చేసేదేమీ లేక ఇక అందరూ డిమాండ్ చేసినట్లుగానే టీ20 కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ కు అప్పగించింది బీసీసీఐ.

 ఇక రోహిత్ శర్మ తనదైనా సారథ్యం  తో ప్రస్తుతం టీమిండియా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. స్వదేశంలో తన కెప్టెన్సీలో ఆడిన మొదటి టి 20 సిరీస్ లోనే ఘన విజయాన్ని సాధించాడు. ఇక ఇటీవలే రోహిత్ శర్మ కెప్టెన్సీపై సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ది స్మార్ట్ క్రికెట్ బ్రెయిన్ అంటూ వ్యాఖ్యానించాడు. సచిన్ టెండూల్కర్ దేనికీ భయపడడు ఒత్తిడిని అధిగమించగలడు... జట్టును నడిపించే వ్యక్తికి ఈ లక్షణాలు చాలా ముఖ్యం.. ఒక జట్టును ముందుండి నడిపిస్తున్న సమయంలో ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం.. రోహిత్ ఇలా చాలా సార్లు చేస్తాడు అంటూ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: