కివీస్ పై ఇండియా గెలుపు ఇక లాంఛనమే?

VAMSI
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ లో ఘన విజయానికి ఇండియా బాటలు వేసుకుంది. ఇప్పటికీ ఈ టెస్ట్ లో రెండు రోజులు ముగిశాయి. అయితే అప్పుడే విన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఆల్ రౌండ్ ప్రతిభను కనబరిచిన టీమిండియా గెలుపుకు కొంత దూరంలో ఉంది. ముంబై టెస్ట్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా 325 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఇండియా తరపున మయాంక్ అగర్వాల్ 150 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒక్కడే 10 వికెట్లను తీసి చరిత్రలో మిగిలిపోయాడు. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ లో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత అజజ్ పటేల్ మూడవ వ్యక్తిగా నిలిచాడు.
ఈ విషయం ఒక్కటే న్యూజిలాండ్ కు ఊరట కలిగించిన విషయం. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన న్యూజిలాండ్ కేవలం 62 పరుగులకు ఆల్ ఔట్ అయిపోయింది. కెప్టెన్ విలియంసన్  గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యడు. ఫాలో ఆన్ ప్రమాదంలో పడిన కివీస్ కు బ్యాటింగ్ ఇవ్వకుండా... సెకండ్ ఇన్నింగ్స్ ను ఇండియా తీసుకుంది. ప్రస్తుతం మయంక్ మరియు పుజారాలు  వికెట్ పడకుండా 69 పరుగులు చేశారు. ఈ రోజు ఇంకో 100 పరుగులు చేసి మొత్తం 450 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచడానికి ఇండియా ప్రణాళిక చేస్తుంది.
ఇప్పుడు ఇండియా బౌలర్లు అంతా ఒక రిథమ్ లో ఉన్నారు. కాబట్టి కివీస్ ను ఆల్ ఔట్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ మ్యాచ్ కనుక కివీస్ ఓడిపోతే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకుండా తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్లనుంది. అయితే ఈ విజయం ఈ రోజా? లేదా రేపా అన్నది మాత్రమే తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: