సెహ్వాగ్ తర్వాత మయాంక్ మాత్రమే.. అరుదైన రికార్డు?

praveen
ఇటీవలి కాలంలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతున్నారు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అయితే యువ ఆటగాళ్లు తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. వరుసగా సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అవుతూ ఉంటే.. అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న యువ ఆటగాళ్లు మాత్రం సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలా క్రికెట్ లో అదరగొడుతున్న యువ ఆటగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవలే టెస్ట్ ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రేయస్సు అయ్యర్.

 పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణించిన అయ్యర్ టెస్ట్ ఫార్మాట్ లో ఎలా రాణిస్తాడో అని అందరూ భావించారు. అయితే ఊహించిన దాని కంటే అద్భుతంగా రాణించాడు శ్రేయస్ అయ్యర్. ఏకంగా అరంగేట్రం టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు.  ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ లో కూడా 65 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు శ్రేయస్ అయ్యర్. అరంగేట్రం మ్యాచ్లో సెంచరీ చేసి ఏకంగా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో యువ ఆటగాడు ఇలాంటి రికార్డులను క్రియేట్ చేశాడు.

 ఇటీవలే న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ఈ సెంచరీతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యువ ఆటగాడు. పదేళ్ల తర్వాత న్యూజిలాండ్ పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన ఒక భారత ఓపెనర్ గా రికార్డు సృష్టించాడు. అయితే అంతకుముందు 2010లో అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేశాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరు కూడా న్యూజిలాండ్ పై స్వదేశంలో సెంచరీ చేసింది లేదు.  కాగా ఇటీవలే మయాంక్ అగర్వాల్ సెంచరీ చేసి  రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: