భారత్ ను వెనక్కి నెట్టిన పాకిస్తాన్.. కోహ్లీ ఏం చేస్తాడో?

praveen
ప్రస్తుతం భారత జట్టు స్వదేశీ గడ్డపై న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది భారత్. ప్రస్తుతం ఆడుతున్న టెస్టు సిరీస్ అటు ఎంతో కీలకంగానే మారి  పోయింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం టెస్టు సిరీస్లో విజయాల ఆధారంగానే ప్రపంచ ఛాంపియన్షిప్ లో పాయింట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే కాన్పూర్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరిగింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఒకానొక సమయంలో భారత్ గెలుస్తుంది అని అనుకున్నారు అందరు.
 కానీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ అద్భుతమైన పోరాటంతో చివరి మ్యాచ్ డ్రాగా ముగియడం గమనార్హం. అయితే గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడం  తో ఇక ఎక్కువ పాయింట్లు కూడా గెలుచుకో లేకపోయింది టీమిండియా. ఈ క్రమం లోనే 12 పాయింట్లు గెలుచు కోవాల్సిన  టీమిండియాకు కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే వచ్చాయి. న్యూజిలాండ్ జట్టుకు కూడా నాలుగు పాయింట్లు రావడం గమనార్హం. ఇలా మ్యాచ్ డ్రాగా ముగియడం తో అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది టీం ఇండియా.

 ఈ క్రమం లోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో భారత్ ను అధిగమించింది పాకిస్థాన్ జట్టు.. బంగ్లాదేశ్ టెస్ట్ గెలిచిన తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మరోవైపు స్వదేశీ గడ్డపై వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించిన శ్రీలంక జట్టు మొదటి స్థానానికి ఎగబాకింది. కాన్పూర్లో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడం తో ఇక భారత జట్టు మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. కాగా గత ఏడాది  టెస్టు చాంపియన్షిప్ గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఆరో స్థానంలో బంగ్లాదేశ్ ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: