అందరికి క్షమాపణలు చెప్పిన పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్...

M Manohar
పాకిస్థాన్‌లోని ఓ టీవీ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ బుధవారం క్షమాపణలు చెప్పాడు. గత ఆదివారం దుబాయ్‌ లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌ లో భారత్‌ పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత యూనిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది ఈ వ్యాఖ్యను అభ్యంతరకరంగా భావించడంతో అభిమానులు మరియు మాజీ క్రికెటర్ల నుండి ఆగ్రహం వచ్చింది. దాంతో యూనిస్ ఈరోజు ట్విట్టర్‌ లో క్షమాపణలు చెప్పాడు, అతను ఆ సమయంలో తెలియకుండా ఈ వ్యాఖ్య చేసానని మరియు దానిని తప్పును అంగీకరిస్తున్నాను అని పేర్కొన్నాడు.
అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌ లో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ విరామ సమయంలో నమాజ్ చేయడంపై యూనిస్... భారత ఆటగాళ్ల ముందు నమాజ్ చేయడం స్పెషల్ అని వివాదాస్పద వ్యాఖ్య చేసాడు. అది ఇక్కడ ఉపఖండంలోని అభిమానులకు ఆయన మాటలు మింగుడు పడలేదు. ఏదో ఆ సమయంలో అలా మాట వచ్చింది. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో అలా చెప్పలేదు. నేను దీనికి క్షమాపణలు కోరుతున్నాను, ఇది అస్సలు ఉద్దేశించబడలేదు, నిజంగా నాదే తప్పు. క్రీడలు జాతి, రంగు లేదా మతంతో సంబంధం లేకుండా ప్రజలను ఏకం చేస్తాయి అని యూనిస్ తెలిపాడు. అయితే “వకార్ యూనిస్ చేసినవి నీచమైన మరియు అసహ్యకరమైన వ్యాఖ్యలు అని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నారు. మనం క్రికెట్ ప్రపంచాన్ని ఏకం చేయాలి... కానీ మతం వారీగా విభజించకూడదు” అని యూనిస్ క్షమాపణ చెప్పడానికి ముందు ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే అన్నారు.
ఇక ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఈ హైవోల్టేజీ ఎన్‌కౌంటర్‌లో 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం అందుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: