స్టార్ క్రికెటర్ డీకాక్ కెరీర్ ముగిసినట్టేనా?

VAMSI
క్రికెట్ అనే ఒక క్రీడ ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎంతగానో ఇష్టపడే వాటిలో ఒకటి. ముఖ్యంగా ఇప్పుడు క్రికెట్ పలు రకాల లీగ్స్ కారణంగా ఇంకా ప్రజల్లోకి ఎక్కువగా దూసుకెళ్లిందని చెప్పాలి. దాదాపు అన్ని దేశాలలోనూ లీగ్ లు ఉన్నాయి. అయితే ప్రతి క్రీడలాగానే క్రికెట్ కూడా ఒక బోర్డు మరియు కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. అని దేశాల క్రీడాకారులు వారి దేశం చెప్పిన విధంగానే నడుచుకుంటూ ఉంటాయి. కొన్ని సార్లు రూల్స్ ను అతిక్రమించిన చాలా మంచి క్రికెటర్ల కెరీర్ ఇబ్బందుల్లో పడింది. అయితే ఇవి తెలిసి చేస్తారో లేదా తెలియక చేస్తారో తెలియకపోయినా జట్టులో ప్రతి ఒక్కరూ పాటించే రూల్ ను అతిక్రమించడం అనేది సబబు కాదు.
అయితే ఇప్పుడు యూఏఈ మరియు ఒమన్ దేశాలలో జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా నిన్న సౌత్ ఆఫ్రికా మరియు వెస్ట్ ఇండీస్ ల నడుమ జరిగిన మ్యాచ్ లో ఒక హఠాత్పరిణామం చోటు చేసుకుంది. వర్ణ వివక్ష చూపడం నేరమని ప్రతి మ్యాచ్ జరిగే ముందు రెండు జట్లలోని ఆటగాళ్లు ఒంటి మోకాలిపై కూర్చుని పిడికిలి బిగించి మనమంతా ఒక్కటే, మన మధ్య తారతమ్యాలు లేవు అని చెప్పడానికి చిహ్నంగా చేస్తారు. అయితే ఇందుకోసం మ్యాచ్ కు ముందే సౌత్ ఆఫ్రికా మరియు వెస్ట్ ఇండీస్ జట్లు మోకాలిపై కూర్చుని చేశారు. కానీ సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ మరియు వికెట్ కీపర్ క్విన్టన్ డికాక్ మాత్రం అందుకు నిరాకరించాడు. ఆ విధంగా చేయడానికి ఇష్టపడలేదు.
ఈ విషయంలో సంతృప్తిగా లేని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు వెంటనే డికాక్ ను ప్లేయింగ్ లెవెన్ నుండి తొలగించారు. ఈ విషయం ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఇందుకు తొందరగా డికాక్ స్పందించి క్షమాపణలు చెప్పకుంటే తన కెరీర్ కు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. ఒక క్వాలిటీ ప్లేయర్ ఒక చిన్న పొరపాటు కారణంగా కెరీర్ నాశనం చేసుకోవడం ఎవ్వరూ జీర్ణించుకోలేరు. మరి చూద్దాం డికాక్ ఏమైనా స్పందిస్తాడేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: