జట్టు నిండా అల్ రౌండర్లే... అయినా ఫలితం శూన్యం?

VAMSI
ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో అన్ని జట్లు ఎలాగైనా విజేతగా నిలవాలని శ్రమిస్తున్నాయి. కానీ ప్రాక్టీస్ లో ఎంత సాధన చేసినా రియల్ గేమ్ లో ఎవరు ఆడారన్నదే లెక్కలోకి వస్తుంది. సూపర్ 12 స్టేజ్ లో మొత్తం 12 జట్లు టైటిల్ వేటలో ఉన్నాయి. వీటిలో ఏ జట్టు ఎలా ఆడుతుంది అని ఒక అంచనా మిగతా జట్లకు ఉంటుంది. కానీ ఒక జట్టు గురించి మాత్రం ఎంత ఆలోచించినా అర్ధం కాదు. ఆ జట్టు మరేదో కాదు, జట్టు నిండా అల్ రౌండర్ లు ఉన్న కరేబియన్ జట్టు వెస్ట్ ఇండీస్. మెయిన్ లీగ్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయిన వెస్ట్ ఇండీస్ సూపర్ 12 లో అయినా తమ సత్తా చూపిస్తుందని అంతా ఊహించారు. కానీ అది తప్పని రుజువు కవాడనైకి ఎన్నో రోజులు పట్టలేదు.
వెస్ట్ ఇండీస్ సూపర్ 12 లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అభిమానుల అంచనాలను తలక్రిందులు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం దుబాయ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 143  పరుగులకు పరిమితం అయింది. ఒక దశలో 170 పరుగులు చేస్తుందనుకున్నా బ్యాట్స్మన్ వైఫల్యంతో తక్కువ స్కోర్ తో సరిపెట్టుకుంది. గతంలో రెండు సార్లు టీ 20 వరల్డ్ కప్ టైటిల్ సాధించిన విండీస్ ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా ఆడుతోంది.
ప్రపంచంలో ఎక్కడ ఏ లీగ్ జరిగిన వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు ఖచ్చితంగా ఉంటారు. వీరిని పోటీ పది మరీ తీసుకుంటారు. అక్కడ వీరి ప్రదర్శన అద్భుతంగానే ఉంటుంది. కానీ అందరూ కలిసి ఆడేసమయానికి సమిష్టిగా విఫలం అవుతున్నారు. జట్టును నిండా అల్ రౌండర్ లు వీరి సొంతం. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల పోల్లర్డ్, రస్సెల్, బ్రేవో, గేల్. లూయిస్, పూరన్ మరియు హేట్మెయిర్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇక ఈ టోర్నీ లో తర్వాతా స్టేజ్ కు వెళ్లాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్ లలోనూ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరి ఏమి చేస్తారో? ఏ విధంగా తమ ఆటతీరును మార్చుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: