రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

Dabbeda Mohan Babu
ఐపీఎల్ 2021 తో యావ‌త్ క్రికెట్ అభిమానులు సుప‌రిచితం అయిప ఆట‌గాడు రుతు రాజ్ గైక్వాడ్. గ‌త సిజన్ ల‌లో ఎక్కువ అవ‌కాశాలు రాక పోవ‌డం తో ఎవ‌రికీ పెద్ద‌గా ప‌రిచ‌యం కాలేదు. కానీ ఈ ఐపీఎల్ లో వ‌చ్చిన వ‌రుస అవ‌కాశాలు పుష్క‌లంగా వాడుకుని సూప‌ర్ బ్యాట‌ర్ గా పేరు తేచ్చు కున్నాడు. అంతే కాకుండా చెన్నై ఐపీఎల్ 2021 క‌ప్ కొట్ట‌డానికి ప్ర‌ధాన కార‌కుడు అయ్యాడు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ కూడా అందు కున్నాడు. దీంతో యావ‌త్ దేశం చూపు మొత్తం రుతు రాజ్ పై ప‌డింది. ఒకనొక స‌మ‌యంలో రుతు రాజ్ గైక్వాడ్ ను టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ కు సెలెక్ట్ చేయాల్సింది అని ప‌లువురు సీనియ‌ర్ ఆట‌గాళ్లు అనేంత వ‌ర‌కు రుతు రాజ్ క్రేజ్ పెరిగి పోయింది.

ఐపీఎల్ అద్భ‌త ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన రుతు రాజ్ గైక్వాడ్ కు పెద్ద ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. ఏకంగా ఒక జట్టు ను న‌డిపించాల‌ని కెప్టెన్ గా నియ‌మించారు. న‌వంబ‌ర్ 4 నుంచి మ‌న దేశంలో స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్న‌మెంట్ జ‌ర‌గ‌బోతుంది. అయితే మ‌హారాష్ట్ర కు చెందిన రుతు రాజ్ ను మ‌హా రాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ కీల బాధ్య‌త‌లను అప్ప‌జెప్పింది. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీ మ‌హా రాష్ట్ర జ‌ట్టు కు నాయ‌క‌త్వం వ‌హిచేలా కెప్టెన్ బాధ్య‌త‌లను ఇచ్చింది. 24 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న రుతు రాజ్ గైక్వాడ్ కు ఇంత పెద్ద బాధ్య‌త అప్ప‌గించ‌డం ఆశ్చ‌ర్య‌మేన‌ని చెప్పాలి. అలాగే ఈ జ‌ట్టు కు వైస్ కెప్టెన్ గా నౌష‌ద్ షేక్ ను నియ‌మించింది. అయితే స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో మ‌హారాష్ట్ర త‌న మొద‌టి మ్యాచ్ ను త‌మిళ నాడు తో ఆడ‌నుంది. అయితే ఐపీఎల్ స్టార్ బ్యాట‌ర్ గా పేరు తెచ్చు కున్న రుతు రాజ్ గైక్వాడ్ ఇప్పుడు మంచి కెప్టెన్ గా కూడా పేరు తెచ్చు కుంటాడా అనేది చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: