భారత బౌలింగ్ పై.. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అది హై వోల్టేజీ మ్యాచ్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి చిరకాల ప్రత్యర్థులు కూడా కొనసాగుతున్నాయి పాకిస్తాన్ భారత జట్లు. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు మొత్తం మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ ఫై భారీ రేంజ్ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్గా టీమిండియా జట్టు బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే.

 అయితే అంతకుముందు వార్మప్ మ్యాచ్లో కూడా టీమిండియా జట్టు విజయం సాధించింది. ఇక అదే దూకుడుతో రంగంలోకి దిగిన టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి టీమిండియా ఆటగాళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే అతికష్టంమీద 150 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. అయితే మొదటి 5 ఓవర్లలోనే టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది అని చెప్పాలి. ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో కూడా టీమిండియా బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలం అయింది. కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయ లేకపోయింది టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం.

 ఈ క్రమంలోనే ఇటీవలే భారత బౌలింగ్ పై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు సల్మాన్ బట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు  భారత మిస్టరీ స్పిన్నర్ గా పేరున్న వరుణ్ చక్రవర్తి వేసిన బంతులను పాకిస్థాన్లోని గల్లీ పోరగాళ్లు కూడా రోజు ఎదుర్కొంటారు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. వేళ్ళతో ట్రిక్స్ చేస్తూ బ్యాట్స్మెన్లను తికమక పెట్టే ప్రయత్నం పాకిస్తాన్లో సాధారణం అయిపోయింది అంటూ వ్యాఖ్యానించాడు. అందుకే పాకిస్తాన్ ఓపెనర్లు వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్ను ఎంతో సునాయాసంగా ఎదుర్కొన్నారు వ్యాఖ్యలు చేసాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్.అయితే గతంలో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ ఫై కూడా పాకిస్తాన్  క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: