స్కానింగ్ కోసం పాండ్య.. మిగితా మ్యాచ్ లకు అనుమానమే...?

M Manohar
ఆదివారం దుబాయ్‌లో జరిగిన తమ టీం ఇండియా ఓపెనర్‌లో పాకిస్థాన్‌తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కుడి భుజానికి తగలడంతో స్కాన్ కోసం వెళ్ళాడు. ఈ టోర్నీలో ఓ ఫినిషర్ గా ఉంటాడు అని భావించిన పాండ్య ఇప్పుడు గాయం బారిన పడటం జట్టుకు పెద్ద దెబ్బ. అయితే పాండ్య భారత జట్టు యొక్క తర్వాతి మ్యాచ్ లకు కూడా అందుబాటులో ఇండటం కష్టమే అని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే బౌలింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్న పాండ్య కు ఈ గాయం మరో సమస్య మారింది. అయితే ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది భుజంపై కొట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా 2రెండవ భాగంలో మైదానంలోకి రాలేదు. పాండ్యా స్థానంలో ఇషాన్ కిషన్ ఫిల్డింగ్ కు వచ్చాడు. అయితే స్కానింగ్ కోసం పాండ్యాను ఆసుపత్రికి తరలించినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. పాండ్యా ఎనిమిది బంతుల్లో 11 పరుగులు చేశాడు పాండ్య. ఇక భారత్ వారి ఇన్నింగ్స్‌లో 151/7 పరుగులు చేసింది.
అయితే పాండ్యా మరియు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ టోర్నమెంట్‌లో ఏదో ఒక సమయంలో బౌలర్‌గా ఉపయోగించబడాలని గతంలో చెప్పారు. టోర్నీలో ఏదో ఒక సమయంలో హార్దిక్ రెండు ఓవర్లు బౌలింగ్ చేయగల దశకు చేరుకున్నాడు' అని విరాట్ కోహ్లీ శనివారం విలేకరులతో అన్నారు. ఇక బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యకు తాను ఎప్పుడూ మద్దతు ఇస్తానని, అతను జట్టుకు చాలా విలువైనవాడని భారత కెప్టెన్ చెప్పాడు. అయితే 28 ఏళ్ల ఆల్ రౌండర్ గాయం కారణంగా ఫీల్డింగ్‌కి రాకపోవడం విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారతదేశానికి పెద్ద ఆందోళన కలిగిస్తుంది. బ్యాటింగ్ లైనప్‌లో హార్దిక్‌కు ఫినిషర్ కీలక పాత్ర అప్పగించబడింది. దుబాయ్‌లో ప్రధాన ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కోహ్లీ నాయకత్వంలోని జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఈ వార్త భారతదేశ కష్టాలను జోడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: