భారత్ కు షాక్... వికెట్ కోల్పోకుండా పాక్ విజయం

M Manohar
భారత్ క్రికెట్ అభిమానులకు షాక్ తగిలింది. ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ 20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ జట్టు తో భారత జట్టు తలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఛేజింగ్ కు వచ్చిన పాకిస్తాన్ జట్టు ముందు 152 పరుగుల లక్ష్యంను మాత్రమే ఉంచగలిగింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు మొదటి నుండి లక్ష్యం వైపుకే సాగింది. ఏ సమయంలోనూ భారత జట్టు మ్యాచ్ తమ వైపు తిప్పుకునేల కనిపించలేదు. ఇక ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. దీనిని చూసే అర్థం చేసుకోవచ్చు మన భారత జట్టు బౌలింగ్ ఎంత ఘోరంగా ఈ మ్యాచ్ లో ఉంది అనేది.
ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 52 బంతుల్లో  68 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు. దాంతో 17.5 ఓవర్లలోనే పాకిస్తాన్ జట్టు భారత జట్టు నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుపై మొదటిసారిగా విజయం సాధించింది ప్రత్యర్థి పాకిస్తాన్. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో కేవలం 151 పరుగులు చేసి ఏడు వికెట్ల చేజార్చుకుంది. అయితే భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే 57 పరుగులతో రాణించాగా పంత్ 39 పరుగులతో కోహ్లీ కి అండగా నిలిచాడు. కానీ మిగిలిన వారు ఎవరు అంతగా ఆకట్టుకోలేదు. ధనతో భారత్ తక్కువ టార్గెట్ నే పాక్ కు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: