ఈ మ్యాచ్ వదిలేయండి అంటూ భారత ఆటగాళ్లకు చెప్తున పాక్ మహిళా

M Manohar
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా ఓ హై ఓల్టేజీ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఈ పొట్టి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ లలో మొత్తం ఐదు సార్లు తలపడగా అన్ని మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో కూడా టీమిండియా చాలామంది ఫేవరెట్ అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళా రిపోర్టర్ మన భారత ఆటగాళ్లను రిక్వెస్ట్ చేస్తూ కనిపిస్తుంది.
అయితే యూఏఈ కి బహుశా మ్యాచ్ కోసం వెళ్లిన ఈ మహిళా రిపోర్టర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో మన భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ ముగించుకుని వస్తున్నారు. ఆ సమయంలో మొదట బుమ్రా ను పిలిచిన ఆ మహిళ ఈ మ్యాచ్ను మాకు వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. అది విన్న బుమ్రా చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వెంటనే పంత్ తో కలిసి వస్తున్న ధోనీని పిలుస్తూ ఈ ఒక్క మ్యాచ్ ని వదిలి పెట్టండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అలాగే ఈ మ్యాచ్ లో ఎటువంటి వ్యూహాలు రచించకండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మహిళా రిపోర్టర్ యొక్క రిక్వెస్ట్ చూస్తేనే ఈ మ్యాచ్ లో మన భారత్ విజయం సాధిస్తుందనే నమ్మకం పాకిస్తాన్ వాళ్ళకి ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రెండు జట్ల కు ఇదే ఈ ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్. ఇక ఈ మ్యాచ్కు ముందు ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు భారత జట్టు విజయం సాధించగా పాకిస్తాన్ జట్టు రెండవ ప్రాక్టీస్ మ్యాచ్లో ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: