విండీస్ పై ఇంగ్లాండ్ సునాయాస విజయం...

M Manohar
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 12 స్టేజ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా ఈరోజు గ్రూప్ 2 లో రెండో మ్యాచ్ వెస్టిండీస్ అలాగే ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ అభిమానులను నిరాశపరిచింది చెప్పాలి. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్కు వచ్చిన వెస్టిండీస్ జట్టు తన స్వభావానికి విరుద్ధంగా కేవలం 55 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఇద్దరు ఎల్ సిమన్స్క్(3), లూయిస్(6) పరుగులు చేయగా క్రిస్ గేల్ 13 బంతుల్లో 13 పరుగులు చేశాడు. అయితే ఈ విండీస్ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గేల్ కావడం గమనార్హం. ఇక వెస్టిండీస్ ఆటగాళ్లు ఎవరు ఈ మ్యాచ్ లో రాణించలేక పోవడంతో ఆ జట్టు 14.2 ఓవర్లలోనే 55 పరుగులు చేసి ఆలౌటైంది.
ఇక ఆతర్వాత 56 పరుగుల అతి స్వల్ప లక్ష్యంతో వచ్చిన ఇంగ్లాండ్ జట్టు మంచిగానే ఆరంభించింది. అయితే ఆ జట్టు ఓపెనర్ జాసన్ రాయ్ 10 బంతుల్లో 11 పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత వచ్చిన ఆటగాళ్ళు జానీ బెయిర్స్టో 9 పరుగులు, మోయిన్ అలీ 3 పరుగులు, లామ్ లివింగ్ స్టోన్ ఒక పరుగు చేసి వెంట వెంటనే ఔట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరో ఓపెనర్ జొస్ బట్లర్ 22 బంతుల్లో 24 పరుగులు చేయగా... కెప్టెన్  మోర్గాన్ 7 బంతుల్లో 7 పరుగులు చేయడంతో 8.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది ఇంగ్లండ్ జట్టు.
అయితే ఇంగ్లాండ్ జట్టు ఈ టోర్నీని అద్భుతమైన విజయంతో ఆరంభించిన వెస్టిండీస్ జట్టు చాలా దారుణమైన ఓటమితో ప్రారంభించింది అనే చెప్పాలి. అయితే వెస్టిండీస్ జట్టుకు ఇది టీ-20 ఫార్మెట్లో రెండవ అతి తక్కువ స్కోరు. మొదటిది కూడా 2019లో ఇంగ్లాండ్ జట్టుకు వ్యతిరేకంగానే 45 పరుగులకు ఆలౌటైంది వెస్టిండీస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: