IND-PAK : టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌ లో భార‌త్ దే పై చేయి

Dabbeda Mohan Babu
మ‌న దేశానికి మ‌న దాయాది దేశ‌మైన పాక్ ల మ‌ధ్య చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక మ్యాచ్ లు జ‌ర‌గ‌డం లేదు. కానీ ఐసీసీ వేదికల పైనే ఈ రెండు జ‌ట్లు త‌ల ప‌డుతున్నాయి. తాజాగా టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంగా ఈ నెల 24 న ఇండియా పాక్ ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే గ‌తంలో టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర ను చూస్తే.. పాక్ పై ఇండియా దే పై చేయి ఉంది. ఈ రెండు దేశాలు టీ 20 ప్ర‌పంచ క‌ప్ చ‌రిత్ర లో మొత్తం 8 సార్లు ప‌రస్ప‌రం త‌ల‌ప‌డ్డాయి. అయితే అందులో 6 సార్లు టీమిండియా నే విజ‌యం సాధించింది. దాయాది దేశం పాక్ కేవ‌లం ఒక్క‌టి అంటే ఒక్క సారే విజ‌యం సాధించింది. మ‌రొక్క మ్యాచ్ టై గా ముగిసింది. ఈ టై అయిన మ్యాచ్ కూడా బౌలౌట్ అనే ప‌ద్ద‌తి ద్వారా టీమిండియా నే విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్ ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. మొద‌ట 2007 టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ లో పాక్  ను టీమిండియా ఢీ కొట్టింది. ఈ మ్యాచ్ టై గా ముగిసింది. అయితే బౌలౌట్ ప‌ద్ద‌తి ద్వారా టీమిండియా నే విజ‌యం సాధించింది. అలాగే ఇదే ఏడాది ఫైన‌ల్ లో కూడా పాక్ తో త‌ల ప‌డింది. అయితే ఇందులోనూ టీమిండియా విజ‌యం సాధించింది. అలాగే 2012 లో వ‌చ్చిన టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాక్ తో ఢీ కొట్టింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న తో సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. అలాగే 2014, 2016 టీ 20 ప్ర‌పంచ క‌ప్ పోటీ ల్లోనూ టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఘ‌న విజ‌యాల‌ను సొంతం చేసుకుంది. మ‌ళ్లి ఇప్పుడు 2021 లో టీ 20 వ‌రల్డ్ క‌ప్ లో టీమిండియా త‌న మొదటి మ్యాచ్ ను దాయాది దేశం అయిన పాక్ తోనే అడుబోతుంది. ఈ మ్యాచ్ లోనూ టీమిండియా హాట్ ఫేవ‌రెట్ గా బ‌రి లోకి దిగుతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం పాక్ ఇప్ప‌టికే త‌న జ‌ట్టు ను ప్ర‌క‌టించింది. అయితే ఈ మ్యాచ్ లోనూ టీమిండియా భారీ విక్ట‌రీ కొట్ట‌డం ఖాయ‌మేన‌ని టీమిండియా అభిమానులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: