భారత్‌తో పోటీ పడటానికి పాకిస్థాన్‌లో ఆటగాళ్లు లేరు...

M Manohar
టెస్టు క్రికెట్‌లో నిలకడగా స్కోర్ చేయగల బ్యాట్స్‌మెన్‌ లను పాకిస్థాన్ ఉత్పత్తి చేయలేదని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడుతుంది. అయితే ఒకప్పుడు పాకిస్తాన్ చాలా బలమైన జట్టును కలిగి ఉంది. అది మా గొప్ప పోటీలకు దారితీసింది. గత 10 సంవత్సరాలలో, పాకిస్తాన్ క్రికెట్ స్థాయి నా అభిప్రాయం ప్రకారం తగ్గింది. బ్యాట్స్‌మెన్ ఎవరూ రాలేదు టెస్ట్ క్రికెట్‌లో వారు నిలకడగా స్కోర్ చేయలేరని నాకు అనిపిస్తుంది అని హర్భజన్ అన్నారు. అయితే ప్రస్తుతం టెస్ట్ లో పాకిస్థాన్ చాలా వెనకపడి ఉంది. ఆ జట్టు ఇప్పుడు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 7 వ స్థానంలో కొనసాగుతుంది. అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. టెస్టులో ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంది అనేది.
ఇక టీ 20 అనేది ఎవరైనా పరుగులు చేయగల ఫార్మాట్. నేను 1998 లో అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసినప్పుడు, పాకిస్థాన్‌లో ఇంజామామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, సలీం మాలిక్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ మరియు సక్లైన్ ముస్తాక్ వంటి బ్యాట్స్‌మన్‌లు ఉన్నారు. ఈ రోజు పాకిస్తాన్ భారతదేశంతో పోటీ పడటం కనిపించడం లేదు ఎందుకంటే వారి జట్టులో ఆ స్థాయి ఆటగాళ్లు ఒకరు లేదా ఇద్దరు ఉండవచ్చు. నిజంగా భారత్‌ ను ఓడించగల జట్లు ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా అని హర్భజన్ ఆయన అన్నారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంత నష్టాల్లో నడుస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఐసిసి నిధులను బట్టి బోర్డు నడపాల్సి ఉంటుందని ఉంటుందని పిసిబి అధ్యక్షుడు రమీజ్ రాజా ఇటీవల  ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆ ఐసీసీనే బీసీసీఐ పై ఆధారపడి ఉంది అని కూడా చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: