ఐర్లాండ్ కు షాక్.. సూపర్-12లోకి నమీబియా

M Manohar
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ 20 ప్రపంచ కప్లో నేటి తో క్వాలిఫైయర్ మ్యాచ్లు ముగియనున్నాయి. అయితే ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఎనిమిది జట్లు పోటీపడగా నాలుగు జట్లు మాత్రమే సూపర్ 12 కు వస్తాయి. అయితే ఆ నాలుగు జట్ల లో ఐర్లాండ్ జట్టు కూడా ఉంటుందని చాలామంది భావించారు. కానీ ఆ జట్టుకు ఈరోజు నమీబియా షాకిచ్చింది. అయితే క్వాలిఫైయర్ మ్యాచ్లో ఆడిన రెండు ఆటల్లో ఈ రెండు జట్లు ఒక్కొక్క విజయం సాధించి ఉన్నాయి. దాంతో ఈ రెండు జట్లు తలపడ్డ నేటి మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారే సూపర్ 12 వచ్చే పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఐర్లాండ్ జట్టు ఓపెనర్లు స్టిర్లింగ్ (38) కెవిన్ ఓ బ్రెయిన్ (25) బాగానే రాణించి మొదటి వికెట్కు 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఐర్లాండ్ కెప్టెన్ బాల్బిర్నీ 21 పరుగులు చేయగా మిగిలిన వారెవరు డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేరుకోలేదు. దాంతో ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేయగలిగింది. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో వచ్చిన నమీబియా జట్టు ఇరవై ఐదు పరుగులకే క్రెయిగ్ విలియమ్స్ (15) మొదటి వికెట్ కోల్పోయిన... ఆ తర్వాత జట్టు కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (53) అర్థశతకం తో రాణించాడు. అలాగే జేన్ గ్రీన్ (24), డేవిడ్ వైస్ (28) ఆకట్టుకున్నారు. దాంతో నమీబియా జట్టు 18.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో మొదటిసారిగా టి20 ప్రపంచ కప్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది నమీబియా. అలాగే ఈ టైటిల్ పోరుకు వస్తుందనుకున్న ఐర్లాండ్ జట్టు క్వాలిఫై స్టేజ్ నుండి తిరిగి వెళాల్సి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: