రోహిత్, కోహ్లీ కంటే అతనివల్లే మాకు ఎక్కువ ప్రమాదం : పాకిస్థాన్ కోచ్

M Manohar
ఈ నెల 24న భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ఓ హై హొల్టేజ్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు దుబాయ్ వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్... ప్రస్తుత పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే టీం ఇండియాలోని ఓ బ్యాటర్ వల్ల పాక్ కు ప్రమాదం పొంచి ఉందని అన్నాడు. అయితే అది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాదు. భారత యువ ఓపెనర్ రాహుల్ వల్లే పాకిస్తాన్ కు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
అయితే రాహుల్ పొట్టి ఫార్మాట్లో గత కొంత కాలంగా అద్భుతం గా రాణిస్తున్న విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన గత రెండు ఐపీఎల్ సీజన్లలో రాహుల్ అదరగొట్టాడు. దాంతో తాజాగా మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ... భారత్ - పాక్ మ్యాచ్ లో కెప్టెన్సీని కీలక పాత్ర పోషిస్తుంది. ఐపీఎల్ 2021 లో కూడా ఎంఎస్ ధోనీ, ఇయాన్ మోర్గాన్ ల కెప్టెన్సీ కారణంగానే రెండు జట్లు ఫైనల్ కు వచ్చాయి. చెప్పాలంటే... ఆ ఇద్దరి బ్యాటింగ్ ఫామ్ అంత బాగాలేదు. కానీ వారు తమ జట్లను అద్భుతంగా నడిపించారు. కాబట్టి ఈ మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ కూడా తన కెప్టెన్సీలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే జట్టుకు విజయం అందుతోంది అని అన్నాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్ గానే కాకుండా ఓ బ్యాటర్ గా కూడా బాబర్ ఆజమ్ పై ఒత్తిడి ఉంటుంది. భారత్ తో జరిగే మ్యాచ్లో అతని పై చాలా ఆశలు పెట్టుకున్నారు అని మాథ్యూ హేడెన్ అన్నాడు.
ఇక ఈ మ్యాచ్లో భారత జట్టులోని కెఎల్.రాహుల్ కీలకమైన ఆటగాడని చెప్పాడు. నేను రాహుల్ ఆడుతున్న విధానాన్ని గమనించా... ఈ పొట్టి ఫార్మాట్ లో అతను ఆధిపత్యం బాగా చాలా చేలా ఇస్తాడు. అతని వల్ల పాక్ జట్టుకు ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కీపర్ రిషబ్ పంత్ కూడా మ్యాచ్ను మలుపు తిప్పగల డు. వారిద్దరినీ కట్టడి చేస్తే పాకిస్థాన్ విజయం సాధించవచ్చు అని హెడెన్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: