భారత్ - పాక్ : జట్టును ప్రకటించిన సెహ్వాగ్...

M Manohar
ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ 20 ప్రపంచకప్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ vs పాకిస్థాన్. అయితే ఈ మ్యాచ్ గురించి ఇప్పటికే ఎన్నో చర్చలు మొదలయ్యాయి. ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనే దాని గురించి... ఏ జట్టు ఏఏ ఆటగాడిని బరిలోకి దింపుతుంది అనే దాని గురించి ఇప్పటికే అనాలసిస్ లు మొదలయ్యాయి.
అయితే తాజాగా భారత మాజీ డాషింగ్ ఓపెనర్ ప్రస్తుత హిందీ కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగే భారత జట్టును అంచనా వేశాడు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ అలాగే కేఎల్ రాహుల్ కు అవకాశం ఇచ్చాడు. ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోలేదు. అలాగే వన్ డౌన్ గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేయగా ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి తీసుకున్నాడు. అలాగే వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను తీసుకోగా ఫిట్నెస్ లేక సతమతమవుతున్న హార్దిక్ పాండ్య కు కూడా తన జట్టులో అవకాశం ఇచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక అలాగే ఆల్ రౌండర్ కోటాలో స్పిన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన సెహ్వాగ్ పేస్ సెహ్వాగ్ గా శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నాడు. అలాగే జట్టులో స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చినా వీరేంద్ర సెహ్వాగ్... ముఖ్య పేసర్లుగా మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా లను ఎన్నుకున్నాడు, ఇక వామప్ మ్యాచ్లో అంతగా రాణించని భువనేశ్వర్ కుమార్ కు అలాగే అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్ కూడా మొండి చేయి చూపించాడు సెహ్వాగ్. చూడాలి మరి ఈ మ్యాచ్ కు ఎటువంటి జట్టును భారత్ ఎంపిక చేస్తుందని అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: