టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్‌పై గెలుపు భార‌త్‌దే.. సెంటిమెంట్ రిపీట్‌..!

VUYYURU SUBHASH
భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య పోరు అంటే రెండు దేశాల అభిమానుల మ‌ధ్య పెద్ద యుద్ధ వాతావ‌ర‌ణ మే ఉంటుంది. ఇక ప్ర‌పంచ క‌ప్‌లో ఈ రెండు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి అంటే పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ప్రపంచ క‌ప్ మ్యాచ్ ల‌లోనూ పాకిస్తాన్ పై భార‌త్ తిరుగులేని విజ‌యాలు సాధించింది. ఇక ఈ నెల 24న జ‌రిగే టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న మెంట్ లోనే గ‌త సంప్ర‌దాయాల‌ను బ‌ట్టి చూస్తే మ‌రోసారి పాకిస్తాన్ పై భార‌త్ తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. అస‌లు ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ టీ 20 మ్యాచ్‌ల‌ను ఓ సారి గుర్తు చేసుకుందాం.

1 - తొలి వరల్డ్‌ టీ20 టోర్నీలో డర్బన్ లో 2007 సెప్టెంబరు 14 న జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ గెలిచింది. మ్యాచ్ టై అయ్యింది. అయితే బౌల్‌ అవుట్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించి గెలుపు బావుటా ఎగ‌ర‌వేసింది. అప్పుడు సూప‌ర్ ఓవ‌ర్ లేదు.
2- అదే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఫైనల్లో మ‌రోసారి ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఫైన‌ల్లో దాయాది అయిన‌ ప్రత్యర్థిపై 5 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని గెలు చు కుంది.

3- ఆ త‌ర్వాత కొలంబోలో జ‌రిగిన టీ 20 ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లో 128 పరుగులకే ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి.. మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక వికెట్ తీయ‌డం మ‌రో విశేషం.
4- ఆ త‌ర్వాత ఢాకాలో జరిగిన వ‌న్ సైడ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో 130 పరుగులకే పాక్ చేతులు ఎత్తేసింది. ఆ త‌ర్వాత భార‌త్ సులువుగా గెలిచింది.

5- ఆ త‌ర్వాత మ‌న దేశంలో జ‌రిగిన టీ 20 ప్ర‌పంచ క‌ప్‌లో సూపర్‌-10 గ్రూపు-2లో భాగంగా కోల్‌కతాలో జ‌రిగిన ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్ 6 వికెట్ల‌తో గెలిచింది. ఈ మ్యాచ్ లో పాక్ 118 ప‌రుగుల‌కే ఆల్ అవుట్ అయ్యింది.

6- ఇక ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత కోహ్లి సారథ్యంలోని మ‌న జ‌ట్టు దుబాయ్ వేదిక‌గా ఆరో సారి టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ బోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: