IND Vs PAK మ్యాచ్‌: ఆ మూడే పెద్ద త‌ల‌నొప్పా...!

VUYYURU SUBHASH
టి 20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఈ నెల‌ 24న టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య జ‌రిగే హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. మామూలుగానే భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగితే ఎంత ఆస‌క్తి ఉంటుందో తెలిసిందే. అలాంటి ది ఏకంగా ప్ర‌పంచ క‌ప్‌లో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే చాలా ఆస‌క్తి ఉంటుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ క‌ప్‌లో జ‌రిగిన అన్ని మ్యాచ్ ల‌లో భార‌త్ సంపూర్ణ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తూ పై చేయి సాధించింది.

ఇక ఈ నెల 24న జ‌రిగే మ్యాచ్ లో కూడా భార‌త్ విజ‌యం సాధిస్తుంద‌న్న అంచ‌నాలే ఎక్కువుగా ఉన్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రెండు వార్మ‌ప్ మ్యాచ్ ల‌లో కూడా భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించి తిరుగులేని ఆత్మ విశ్వాసంతో ఉంది. ఇక పాకిస్తాన్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే భార‌త్ జ‌ట్టు నుంచి ఓపెనింగ్ , వ‌న్ డౌన్ స్థానాల కు క్లారిటీ ఉంది. అయితే నాలుగు, ఆరు, ఏడు స్థానాలపై మాత్రం స‌స్పెన్స్ నెల‌కొంది.

ఓపెన‌ర్లు గా కేఎల్‌. రాహుల్ - రోహిత్ శ‌ర్మ వ‌స్తారు. ఇక వ‌న్ డౌన్ కోహ్లీ వ‌స్తాడు. నాలుగో స్దానంలో సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్ పోటీలో ఉన్నారు. ఇషాన్ వ‌రుస హాఫ్ సెంచ‌రీ ల‌తో దుమ్ము రేపాడు. దీంతో ఈ ఇద్ద‌రిలో ఎవ‌రికి నాలుగో ప్లేస్ ఇవ్వాల‌న్న‌ది కోహ్లీకి పెద్ద స‌స్పెన్స్‌.

ఐదో స్థానంలో రిషబ్‌ పంత్ వ‌స్తే.. ఆరో స్థానంలో ర‌వీంద్ర జ‌డేజా రావ‌చ్చ‌ని అంటున్నారు. ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా వ‌స్తారా ?  లేదా కోహ్లీ నిర్ణ‌యం ఎలా ఉంటుంది అన్న‌ది చూడాలి. ఎనిమిదో స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ లేదా వరుణ్‌ చక్రవర్తి వ‌స్తార‌ని టాక్ ?  9, 10,11 స్థానాల్లో భువనేశ్వర్‌, షమీ, బుమ్రా లు వ‌రుస‌గా బ్యాటింగ్ లైన్లో ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: