టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా...

M Manohar
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021లో 12 జట్లు తలపడనున్నాయి. అందులో ఎనిమిది జట్లు ఇప్పటికే ఈ ప్రపంచ కప్ కోసం అర్హత సాధించి ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక మిగిలిన నాలుగు స్థానాల కోసం ఎనిమిది జట్లు ప్రస్తుతం క్వాలిఫైర్స్ లో తలపడుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు బంగ్లాదేశ్ జట్టుతో ఒమాన్ జట్టు తలపడుతుంది. ఇక ఈ రెండు జట్లు ఆడిన తమ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిపోగా ఒమాన్ జట్టు గెలిచింది. అయితే ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ తీసుకోని ఒమాన్ జట్టును బౌలింగ్ కు పంపిస్తుంది. అయితే గత మ్యాచ్ తో తో పోలిస్తే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు ఒక మార్పు చేయగా ఒమాన్  ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి వస్తుంది. అయితే మిగిలిన నాలుగు స్థానాల్లోకి రావడానికి బంగ్లాదేశ్ కు చాలా కీలక మ్యాచ్. గత మ్యాచ్ లో ఓడిన కారణంగా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్ ది. అదే ఒకవేళ ఒమాన్ జట్టు ఇందులో గెలిస్తే దాదాపుగా తన స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో...!
ఒమాన్ : జతీందర్ సింగ్, అకిబ్ ఇలియాస్, కశ్యప్ ప్రజాపతి, జీషన్ మక్సూద్ (c), మహ్మద్ నదీమ్, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, నసీం ఖుషి (wk), కలీముల్లా, ఫయాజ్ బట్, బిలాల్ ఖాన్
బంగ్లాదేశ్ జట్టు : లిటన్ దాస్, మహ్మద్ నయీమ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా (c), అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ (wk), మహేది హసన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: