జట్టులోకి అందరిని తీసుకోవడం చాలా కష్టం : రోహిత్ శర్మ

praveen
ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ మజా అందుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ను ప్రతి సారి మరింత కొత్తగా అందించేందుకు బిసిసిఐ కూడా ఎప్పుడూ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది. అయితే  ఐపీఎల్ మజా   మరింత పెంచేందుకు ఐపీఎల్ సీజన్ లో మరో కొత్త రెండు జట్లను తీసుకువచ్చేందుకు బిసిసిఐ నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన సమావేశం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ లో రాబోతున్న కొత్త జట్లు ఏవి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక ఈ కొత్త జట్లను నిర్మించేందుకు అటు మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐని నిర్ణయించింది.

 దీంతో అభిమానులు అందరిలో కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు ఎంతో పటిష్టంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మెగా వేలం నిర్వహిస్తే మాత్రం ఇక అన్ని జట్ల నుంచి ఎంతో మంది ఆటగాళ్లు తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఇక కొన్ని ఫ్రాంచైజీలు కేవలం ఒక్కరు లేదా ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మిగతా ఆటగాళ్లు అందరూ కూడా మళ్ళీ వేలంలో పాల్గొనాల్సిందే. ఇక అప్పుడు ఏ జట్టు సొంతం చేసుకుంటే ఆ జట్టు తరఫున ఆడాల్సి ఉంటుంది.  ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ జట్టు లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 కాగా ఇదే విషయంపై ఇటీవలే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు జరుగుతాయని రోహిత్ శర్మ అన్నాడు. ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ అందర్నీ కూడా తీసుకోవడం ఎంతో కష్టం. అద్భుతం జరిగితే తప్ప.. ఇదే జట్టు మళ్లీ కొనసాగదు. బూమ్రా, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి వారు ఒక రోజులో స్టార్లు కాలేదని ఎంతగానో కష్టపడ్డారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ముంబై జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుంచి తన ప్రదర్శన మరింత మెరుగైంది అంటూ తెలిపాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: