భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన భారత్‌కు మంచి సంకేతం కాదు...

M Manohar
సోమవారం దుబాయ్‌లో జరిగిన ఐసిసి టి 20 ప్రపంచకప్‌లో తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ మూడు వికెట్ల తీయగా తర్వాత కెఎల్ రాహుల్ మరియు ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీలు సాధించారు. అయితే భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ భారత జట్టులో రెండు ఆందోళనలను ఎత్తి చూపారు. అయితే ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు, భువనేశ్వర్ కుమార్ తన నాలుగు ఓవర్లలో 54/0 పరుగులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన భారత్‌కు మంచి సంకేతం కాదు అని పార్థివ్ పటేల్ అన్నాడు
విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్లను మాత్రమే ఉపయోగించిన తీరును చూసి హార్దిక్ మొదటి కొన్ని ఆటలలో బౌలింగ్ చేయబోతున్నాడని నేను అనుకోను అని పార్థివ్ పటేల్  చెప్పాడు. అలాగే నేను భువనేశ్వర్ కుమార్ గురించి ఆందోళన చెందుతున్నాను. ఐపిఎల్‌లో ఉన్న రూపంలో అతను కనిపిస్తాడు, అక్కడ అతను కేవలం ఆరు వికెట్లు తీసుకున్నాడు, ఇక ఇప్పుడు అతను దాదాపు ప్రాక్టీస్ చేయనట్లుగా, లయ లేకుండా బౌలింగ్ చేసాడు. అందువల్ల మనం తరువాతి ఆటలో శార్దూల్ ఠాకూర్‌ను చూడవచ్చు. ఇది మనం జట్టులో చూడగలిగే కలయిక కావచ్చు" అని పార్థివ్ తెలిపారు.
అయితే నిన్నటి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అజేయంగా 46 బంతుల్లో 70 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 24 బంతుల్లో 51, రిషబ్ పంత్ 14 బంతుల్లో 29 పరుగులు చేశారు. దాంతో భారతదేశం ఆరు బంతులు మిగిలి ఉండగానే 189 పరుగుల టార్గెట్ ను చేరుకుంది. ఇక అంతకుముందు భారత్ టాస్ గెలిచి ఇంగ్లాండ్ ని బ్యాటింగ్‌కు పంపిన తర్వాత... జానీ బెయిర్‌స్టో 36 బంతుల్లో 49 పరుగులు చేశాడు. మరియు మోయిన్ అలీ 20 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దాంతో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది ఇంగ్లాండ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: