విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు...

M Manohar
ఈరోజు 2021 ఐసిసి టీ 20 ప్రపంచ కప్ లో ఇప్పటికే అర్హత సాధించిన జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా పాకిస్తాన్. వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు అనుకున్న విధంగా రాణించలేదు. కేవలం 130 పరుగులే చేసింది. మొదట ఓపెనర్ సిమన్స్ 23 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేయగా... మరో ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ ఆరు బంతుల్లో 2 పరుగులు చేశాడు . ఇక టి-20 స్పెషలిస్ట్ గా పేరున క్రిస్ గేల్ 30 బంతుల్లో 20 పరుగులు చేసి నిరాశపరిచాడు. అలాగే రోస్టన్ చేజ్ 13 బంతుల్లో 9 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన హెట్మైర్ 28 పరుగులు చేయగా  పురాన్ 13 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ కీరన్ పోలార్డ్ కేవలం 10 రోజుల్లో 23 పరుగులతో చెలరేగాడు. దాంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.
ఇక 131 పరుగుల లక్ష్యంతో వచ్చిన పాకిస్తాన్ జట్టు ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 17 బంతుల్లో 13 పరుగులు చేసి నిరాశపరచడు,. కానీ కెప్టెన్ బాబర్ అజాం (50) అర్ధ శతకం సాధించాడు. అలాగే ఫఖర్ జమాన్ కేవలం 24 బంతుల్లో 46 పరుగులు చేశారు. ఇక చివర్లో షోయబ్ మాలిక్ 11 బంతుల్లో 14 పరుగులు చేయడంతో పాకిస్థాన్ జట్టు 15.3 ఓవర్లలోనే 131 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో ఈ ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్లో మొదటి విజయాన్ని నమోదు చేసి ఉత్సాహాన్ని అందిపుచ్చుకుంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ జట్టు ఈ నెల 24న మన భారత జట్టు తో తలపడనున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: