భారత్ టార్గెట్ ఎంతంటే...?

M Manohar
ఐసీసీ టీ20 ప్రపంచకప్ వామప్ మ్యాచ్లో భాగంగా ఈరోజు టీమిండియా ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ ప్రపంచ కప్ టోర్నీలో స్థానం సంపాదించిన 8 జట్లు ఈ వామప్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ తీసుకోవడంతో... టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అయితే మొదట ఓపెనర్లు జాసన్ రాయ్ 17 పరుగులు చేయగా జోస్ బట్లర్ 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మలన్ కూడా 18 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన జానీ బెయిర్స్టో 36 బంతుల్లో 49 పరుగులు చేయగా లివింగ్ స్టోన్ 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అలాగే చివర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 43 పరుగులతో రాణించాడు. దాంతో ఇంగ్లాండ్ 188 పరుగుల వరకు చేరుకోగలిగింది.

ఇక భారత జట్టు బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా పేసర్ జస్ప్రిత్ బూమ్రా వికెట్ స్పిన్నర్ రాహుల్ చాహర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే భారత జట్టు 20 ఓవర్లలో 189 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ లేకపోవడం జట్టు పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది చూడాలి. అయితే ఈ మ్యాచ్ గెలుపు ఓటములు ఏ జట్టు పైన నైనా పెద్దగా ప్రభావం చూపించకపోయినా గెలిచిన జట్టులో ఆత్మవిశ్వాసం పెంచడానికి మాత్రం సహాయపడతాయి. చూడాలి మరి టీమిండియా ఇందులో విజయం సాధించి ప్రపంచ కప్ కు ముందు తన ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటే ఉందా లేదా అనేది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: