ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్... గెలిచేది ఇండియానే ఇదిగో సాక్ష్యం

VAMSI
ఐపీఎల్ ఫీవర్ పోయి ఇప్పుడు పొట్టి ప్రపంచ కప్ ఫీవర్ ఊపందుకుంది. నిన్న స్టార్ట్ అయిన క్వాలిఫైయర్ మ్యాచ్ లతో సమరానికి తొలి అడుగులు పడ్డాయి. రెండు గ్రూపులుగా జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్ లలో ఎనిమిది జట్ల నుండి నాలుగు జట్లు సూపర్ 12 కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే మూడు మ్యాచ్ లు కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు నాలుగవ మ్యాచ్ శ్రీలంక మరియు నమీబియా జట్ల మధ్య జరగనుంది. ఇదిలా ఉంటే క్రికెట్ చరిత్రలో ఒక జట్టు మరొక జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడకుండా రికార్డు సృష్టించింది ఇండియా మరియు పాకిస్తాన్ లు మాత్రమే. అందుకే ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్ లు వస్తే అందరి దృష్టి దాయాదులయిన ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మీదనే ఉంటుంది.
కానీ ఈ మధ్య ఇండియా మరియు పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్ల మధ్యన కొన్ని కామెంట్స్ పరస్పరం చేసుకుంటున్నారు. అయితే వీటి ప్రభావం ఈ వీకెండ్ లో జరగనున్న టీ 20 ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ పై పడుతుందేమోనని కంగారు పడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారు అనే విషయం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ ల చరిత్ర చూస్తే ఇండియా పాకిస్తాన్ ను పూర్తిగా డామినేట్ చేసిందని స్పష్టంగా తెలుస్తోంది.
1992 వరల్డ్ కప్ నుండి మొన్న జరిగిన 2019 వరల్డ్ కప్ వరకు చూస్కుంటే దాదాపు ప్రతి సారి పాకిస్తాన్ ఇండియా చేతిలో ఓటమి పాలయింది. అంటే మొత్తం ఏడు సార్లు ఇండియా పాకిస్తాన్ లు తలపడగా ఒక్క మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ గెలవలేదు. దీనిని బట్టి చూస్తే ఈ ఆదివారం జరగనున్న పొట్టి ప్రపంచ కప్ మ్యాచ్ లోనూ గెలిచేది ఇండియా అని అందరూ ఎంతో విశ్వాసంతో ఉన్నారు. మరి పాకిస్తాన్ పై ఉన్న ప్రపంచ కప్ విజయాల రికార్డును మెరుగుపరుచుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకో ఆరు రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: