ద్రావిడ్ స్థానాన్ని తిరస్కరించిన లక్ష్మణ్....

M Manohar
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) భారత మాజీ బ్యాట్స్‌మన్‌ వివిఎస్ లక్ష్మణ్ ను నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవి కోసం సంప్రదించిన తరువాత అతని దానిని తిరస్కరించారు. రాబోయే టి 20 ప్రపంచ కప్ తర్వాత సీనియర్ పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా ప్రస్తుత నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించనుండటంతో బిసిసిఐ ఇప్పుడు ఆ పదవి కోసం తమ శోధనను కొనసాగిస్తుంది. భారత క్రికెట్‌కు గణనీయమైన సహకారం అందించిన అభ్యర్థి కోసం బీసీసీఐ అన్వేషణలో ఉంది. అయితే లక్ష్మణ్ దేశీయ క్రికెట్‌లో బెంగాల్‌కు బ్యాటింగ్ కన్సల్టెంట్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైసెస్ హైదరాబాద్‌కు టీమ్ మెంటార్ కూడా వ్యవరిస్తున్నాడు. దీనికి తోడు, 46 ఏళ్ల అతను ఇప్పటికి కూడా అత్యుత్తమ భారత టెస్ట్ బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డతాడు. లక్ష్మణ్ తన టెస్ట్ 134 మ్యాచ్‌ల్లో 17 సెంచరీలతో 8781 పరుగులు చేశాడు. అయితే మొదట బీసీసీఐ ప్రధాన హెడ్ కోచ్ కోసం చూస్తున సమయంలో లక్ష్మణ్ పేరు కూడా ఆ జాబితాలో వినిపించింది. కానీ తనకు బదులుగా ద్రావిడ్ వైపు ముగ్గుచూపింది బీసీసీఐ.
అయితే లక్ష్మణ్ ఆ స్థానాన్ని నిరాకరించిన తర్వాత బీసీసీఐ ప్రక్రియను కొనసాగిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. మాజీ జట్టు కెప్టెన్ ద్రవిడ్, భారత జట్టులో లక్ష్మణ్‌కు దీర్ఘకాల సహచరులు కూడా. అయితే ఇప్పుడు ద్రావిడ్ రవిశాస్త్రి స్థానంలో ప్రధాన కోచ్‌గా నియమితులవ బోతున్నారు. అయితే ఈ టీ 20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా శాస్త్రి ఒప్పందం ముగియనుంది. అందుకే అతని స్థానంలో దాదాపుగా ద్రావిడ్ ను తీసుకుంటుంది బీసీసీఐ. ఇక ఈ అక్టోబర్ 24 న టీ 20 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: