ఈ ఊపుతో ఆ జట్టు ఐపీఎల్ టైటిల్ కొట్టేస్తుందా ఏంటి ?

VAMSI
ఐపీఎల్ సీజన్ 14 పార్ట్ 2 రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్ కి ఫేవరెట్స్ మారిపోతున్నారు. ఇందుకు పర్ఫెక్ట్ ఉదాహరణగా కోల్కత్తా నైట్ రైడర్స్ ను చెప్పాలి. ఐపీఎల్ సీజన్ 14 పార్ట్ 1 లో ఆడిన ఏడు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లను మాత్రమే గెలుచుకుని ప్లే ఆఫ్ రేస్ నుండి దూరంగా ఉన్న జట్టుగా నిలిచింది. అయితే కొత్త కెప్టెన్ అయిన మోర్గాన్ కు జట్టు అంతటినీ ఒక తాటిపైకి తీసుకు రావడానికి చాలా సమయమే పట్టింది. పార్ట్ 2 లో దొరికిన సమయాన్ని టీమ్ యాజమాన్యం చక్కగా ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా జట్టులో కేకేఆర్ చేసిన అద్భుతమైన మార్పు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ వెంకటేష్ అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకోవడం, అయితే ఇది ఒక ప్రయోగంగా భావించిన కేకేఆర్... ఇప్పుడు ఆనంద డోలికల్లో తేలియాడుతోంది.
ఇక్కడ యూఏఈ లో కేకేఆర్ బెంగుళూరు తో ఆడిన మొదటి మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఈ సీజన్ టైటిల్ ఫేవరెట్ గా అనుకుంటున్న కోహ్లీ సేనను కేవలం 92 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేకేఆర్ ఓపెనర్లు ఒకప్పుడు బ్రెండన్ మెక్ కలమ్  ఇన్నింగ్స్ ను గుర్తుకు తెచ్చారు. ఓపెనర్లు గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ మరియు శుబ్ మన్ గిల్ మొదటి బంతి నుండి ఎదురు దాడికి దిగారు. బౌండరీలతో హోరెత్తించారు. బౌలర్ ఎవరైనా లెక్క చెయ్యక కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. అయితే ఈ మ్యాచ్ లో తన లైఫ్ లో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న వెంకటేష్ అయ్యర్ ఎటువంటి ఆలోచన లేకుండా ఎంతో అనుభవమున్న ఆటగాడిలా ఆడుతున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే ఈ ఇన్నింగ్స్ గాలి వాటం కాదని చెప్పడానికి ఎంతో సమయం పట్టలేదు. తాను ఆడిన రెండవ మ్యాచ్ లోనే ముంబై తో 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి బుమ్రా బౌల్ట్ లాంటి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్ లో తన మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో మెరుగైన రన్ రేట్ తో నాలుగవ స్థానంలో నిలిచింది. కేకేఆర్ ప్లే ఆప్స్ కు చేరుకోవాలంటే మిగిలిన అయిదు మ్యాచ్ లను గెలుచుకోవాలి. అప్పుడే రన్ రేట్ ఉంది కాబట్టి అవకాశం ఉంటుంది. వెంకటేష్ అయ్యర్ లాంటి మ్యాచ్ విన్నర్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేకేఆర్ ప్లే ఆప్స్ కు చేరడమే కాదు, ఐపీఎల్ సీజన్ 14 టైటిల్ ను గెలుస్తుందని టీం యాజమాన్యం మరియు అభిమానులు అనుకుంటున్నారు. మరి వీరి నమ్మకం నిలుస్తుందా లేదా తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: