మ‌రో అరుదైనా రికార్డు సొంత చెసుకున్న మిథాలీ రాజ్

Dabbeda Mohan Babu


మ‌న దేశ జాతీయ క్రీడ హాకీ. కానీ మ‌న దేశంలో ఎక్కువ ప్రాముఖ్య‌త ఉన్న ఆట మాత్రం క్రికెట్ అని మ‌న అంద‌రికీ తెలిసిందే. మ‌న దేశంలో క్రికెట్ చాలా మంది అభిమానులు ఉన్నారు. కొన్ని చోట్ల అయితే త‌మ అభిమాన క్రికెట‌ర్ల‌కు గుడులు కూడా క‌ట్టించారు. అంత‌టి అభిమానం క్రికెట్ పై ఉంది మ‌న దేశ ప్ర‌జ‌ల‌కు. అలాగే క్రికెట్ అంటే నే స‌చిన్ టెండుల్క‌ర్‌, మ‌హేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ పేర్లు మాత్ర‌మే మ‌న‌కు గుర్తు కు వ‌స్తాయి. వీరి రికార్డులు వీరు ఆడినా మ్యాచ్ లు మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. కానీ మ‌న దేశంలో మ‌హిళా క్రీడాకారులు కూడా త‌మ దైన శైలీలో క్రికెట్ ఆడుతున్నారు. రికార్డుల‌ను కొల్ల‌గొడుతున్నారు.




మ‌న దేశ మ‌హిళా క్రికెట్ గ‌తి ని మార్చిన వారిలో మొద‌టి పేరు మిథాలీ రాజ్ కు ఉంటుంది. మిథాలీ రాజ్ ను స‌చిన్ టెండుల్క‌ర్ గా పోలుస్తారు. గాడ్ ఆఫ్ క్రికెట్ తోనే పొల్చారంటే మిథాలీ రాజ్ సామ‌ర్థ్యం ఎంటో అర్ధ అవుతుంది. టెస్ట్ వ‌న్డే.. టీ ట్వంటి అంటూ ఎ ఫార్మాట్ అయినా మిథాలీ రాజ్ స్టైలే వేరు ఉంటుంది.  ప్ర‌తి ఫార్మాట్ లో ఎదో ఒక రికార్డు ఉంటుంది. భార‌త్ మ‌హిళా క్రికెట్ అంటేనే మిథాలీ రాజ్ గుర్తు కు వ‌చ్చేలా ఎదిగింది.  మిథాలీ రాజ్ కు దేశ వ్యాప్తంగా చాలా మందే అభిమానులు ఉన్నారు. పుట్టింది రాజ‌స్థాన్ అయినా పెరిగింది మాత్రం హైద‌రాబాద్‌. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా అభిమానులను మిథాలి రాజ్ సొంత చెసుకుంది.





 ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని ఫార్మెట్ ల‌లో క‌లిపి మొత్తం  20 వేల ప‌రుగులు సాధించిన ఏకైకా మ‌హిళా క్రికెట‌ర్ మిథాలి రాజ్‌.  తాజా గా మ‌రో ఘ‌న‌త కూడా సాధించింది. ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్ ల‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సంపాధించుకుంది. దీంతో రెండు సార్లు వ‌రల్డ్ నెంబ‌ర్ వ‌న్ గా ఉన్న మహిళా క్రికెట‌ర్ గా మిథాళి రాజ్ నిలిచింది. గ‌తంలో మొద‌టి సారి 2010 లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్‌గా ఉండేది. అలాగే 38 ఏళ్ల వ‌య‌స్సు లోనూ 762 పాయింట్ల‌తో అగ్ర స్థానం నిల‌వ‌డం అంత మాములు విష‌యం కాదు. మిథాళి రాజ్ 1999  నుంచి భార‌త జ‌ట్టు కు ప్రాతినిథ్యం వ‌హిస్తూ వ‌స్తుంది. 22 ఏళ్ల పాటు క్రికెట్ ఆడుతున్న తొలి క్రికెట‌ర్ మ‌థాలి రాజ్





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: