ఐపీఎల్ చూడాలంటే ఇది తప్పనిసరి.. గుర్తుపెట్టుకోండి?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే ఈ సారి ఎంతో పకడ్బందీగా ఐపీఎల్  నిర్వహించేందుకు బిసిసిఐ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది.  ఇకపోతే మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ కు అభిమానులను అనుమతించ లేదు కానీ ఇటీవలే యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ కు మాత్రం అభిమానులను అనుమతిస్తూ బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటీవల స్టేడియంలో అభిమానుల సందడి టీవీల ముందు ఉన్న ప్రేక్షకులందరినీ  ఆకర్షించింది అని చెప్పాలి.  ఇక ఇటీవలే రెండో దశలో భాగంగా చెన్నై సూపర్ కింగ్..  ముంబై ఇండియన్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది.

 అయితే మొన్నటి వరకు ఐపీఎల్ చూసేందుకు అనుమతి లేకపోవడంతో అభిమానులు అందరూ ఎంతో నిరాశ చెందారు.  కానీ ఇప్పుడు ఐపీఎల్ చూసేందుకు ప్రేక్షకులందరినీ అనుమతించడంతో మురిసిపోతున్నారు. ఇక ప్రస్తుతం భారత్లో కాకుండా యూఏఈ వేదికగా జరుగుతూ ఉండటంతో కొంత మంది భారత అభిమానుల వెనకడుగు వేస్తుండగా.. కొద్దిమంది మాత్రం యూఏఈ వెళ్లి ఐపీఎల్ వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో అటు కరోనా వైరస్ ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానులను అనుమతించడం పై యూఏఈ స్టేడియం యాజమాన్యాలు భిన్నమైన రూల్స్ తెరమీదకు తీసుకు వచ్చాయి.

 సాధారణంగా మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేసుకున్న రిపోర్ట్ తప్పనిసరి అంటూ నిబంధనలు పెట్టడం చూశాము.. కానీ ఇటీవలే యూఏఈ లో  స్టేడియం యాజమాన్యాలు మాత్రం ఆర్ టి పి సి ఆర్ రిపోర్ట్ అవసరం లేదు అంటూ తెలిపింది. అయితే టీకా వేసుకున్నట్లు సర్టిఫికేట్ మాత్రం తప్పనిసరి అంటూ స్పష్టం చేస్తోంది. దుబాయ్ స్టేడియం ఈ రూల్స్ పెట్టగా..  అటు షార్జా స్టేడియం మాత్రం ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు తో పాటు టీకా వేసుకున్న సర్టిఫికెట్ కూడా కావాలి అంటూ నిబంధన పెట్టింది. అంతే కాకుండా 16 ఏళ్ల పైబడిన వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఇస్తాము అంటూ  తెలిపింది. అటు అబుదాబి స్టేడియం నిర్వాహకులు కూడా ఇలాంటి రూల్సు పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: