ప్లీజ్.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి : పాకిస్తాన్ మాజీ క్రికెటర్

praveen
పాకిస్తాన్లో అప్పుడప్పుడు ఉగ్రవాదులు రెచ్చి పోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎటువైపు నుంచి ఉగ్రవాదుల దాడి చేసి అల్లకల్లోలం సృష్టిస్తారు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వెళ్లాలంటేనే అందరూ భయపడిపోతుంటారు. ముఖ్యంగా వివిధ దేశాల క్రికెట్ జట్లు అన్ని దేశాలలో పర్యటించడానికి ఆసక్తి చూపుతూ ఉంటాయి. కానీ అటు పాకిస్థాన్ పర్యటన అంటే మాత్రం కాస్త సందిగ్ధంలో పడి పోతూ ఉంటాయి.  ఇప్పటికే భారత్ సహా కొన్ని దేశాలు పాకిస్థాన్లో పర్యటనలు పూర్తిగా నిషేధించాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక రానున్న రోజుల్లో కూడా పాకిస్తాన్ పర్యటనపై మరికొన్ని జట్లు ఇలాంటి తరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు షెడ్యూల్ సిద్ధం చేసింది.  అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా మ్యాచ్ లు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసింది. కానీ చివరి నిమిషంలో న్యూజిలాండ్ జట్టును పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకోవడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కి ఊహించని షాక్ ఇచ్చింది. భద్రతాపరమైన కారణాల వల్లే తాము సిరీస్  చేసుకుంటున్నాము అంటూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.

 ప్రస్తుతం ఇదే ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక ఇదే విషయంపై అటు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ భద్రతా వ్యవస్థను ప్రపంచ దేశాల్లో తక్కువ అంచనా వేస్తున్నామని తమకు క్రికెట్ అంటే కేవలం ఆట కాదు అంతకంటే ఎక్కువ అంటూ వసీం అక్రం చెప్పుకొచ్చాడు. భద్రతాపరమైన కారణాలతో పాక్ లో ఆడేందుకు న్యూజిలాండ్ నిరాకరించిన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు వసీం అక్రమ్. న్యూజిలాండ్ జట్టు సిరీస్ రద్దు చేసుకోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది అంటూ తెలిపాడు. తమ దేశం నుంచి క్రికెట్ తరలిపోకుండా ఏదైనా చేయగలమని ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అంటూ కోరాడు వసీం అక్రమ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: