ముంబై ఇండియన్స్‌పై రూతురాజ్‌ కొత్త చరిత్ర !

Veldandi Saikiran
ఐపీఎల్ 2021 రెండో భాగంలో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్... దుమ్ము రేపాడు. బ్యాటింగ్ లో అర్థ సెంచరీ చేసి ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు రుతురాజ్ గైక్వాడ్. కేవలం 58 బంతులు ఆడిన రుతు రాజ్... ఏకంగా 9 ఫోర్లు మరియు 4 సిక్సర్లు 88 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు యంగ్ బ్యాట్స్మెన్ రుతు రాజు  గైక్వాడ్. 

ముంబై ఇండియన్స్ జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు గైక్వాడ్. ఇక అంతకుముందు చెన్నై బ్యాట్స్మెన్ మైకేల్ హస్సీ  86 పరుగుల తో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో 88 పరుగులు సాధించి మైకేల్ హస్సి రికార్డును బద్దలు కొట్టాడు రుతురాజు గైక్వాడ్. కాగా...  ఐపీఎల్14 లో విజయం సాధించింది చైన్నై సూపర్ కింగ్స్.  

ఏకంగా 20 పరుగుల తేడాతో..ముంబై ఇండియన్స్‌ పై గెలుపొం దింది సీఎ స్‌కే. ఆరు వికెట్ల నష్టానికి  చెన్నై 156 పరుగులు చేయగా... ముంబై  8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడా తో విజయం సాధించింది చెన్నై. ఇక మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీసేన.. తొలి మూడు ఓవర్ల లో మూడు వికెట్లు కోల్పోయి కష్టా ల్లో పడింది. డుప్లెసిస్ మరియు మొయిన్ అలీ డకౌటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు...  రిటైర్డ్ హార్ట్‌ గా పెవిలియన్‌ కు వెళ్లాడు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన చెన్నైని ఆదుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్‌.  చివరికీ చెన్నై గ్రాండ్‌ విక్టరీ అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: