CSK vs MI.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?

praveen
ఐపీఎల్ ప్రారంభం అయ్యింది అంటే చాలు ఇక క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ మజా దొరుకుతుంది. అయితే మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు.  ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అయితే ఐపీఎల్ లో ఎన్ని మ్యాచ్లు వచ్చినప్పటికీ ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే దిగ్గజ జట్లుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ అంటే మాత్రం అదేంటో అందరిలో ఊహించనంత ఉత్కంఠ ఏర్పడుతూ ఉంటుంది.  ఈ రెండు జట్ల లో ఎవరు గెలవ బోతున్నారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది.  కాగా ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

 ఈ క్రమంలోనే నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ ప్రస్తుతం అందరిలో అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఐపీఎల్లో చిరకాల ప్రత్యర్థులుగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడిన భారీ స్కోర్లు నమోదు అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ ఆటగాడు ఎలా అద్భుతంగా రాణిస్తాడు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. ఇక 2021 మొదటి దశలో ఢిల్లీ వేదికగా ఈ రెండు జట్లు తలపడగా ఏకంగా ఈ మ్యాచ్లో 437 పరుగులు నమోదు అయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.

 అప్పటివరకు అంతా పరుగులు చేయని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై తో మ్యాచ్ అనేసరికి భారీ పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత ఎంతో ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది   అయితే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హెడ్ హెడ్ రికార్డులను పరిశీలిస్తే ఏకంగా ఇప్పుడు వరకు 32 మ్యాచ్లలో తలపడ్డాయి ఈ రెండు జట్లు. 19 మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్.. 14 మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచింది. మొత్తంగా చూసుకుంటే ఐదుసార్లు ముంబై టైటిల్ విజేత నిలిస్తే.. మూడుసార్లు చెన్నై టైటిల్ విజేతగా నిలవడం గమనార్హం. కాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాళ్లు గా ఉన్న ఓపెనర్ డూప్లేసెస్ బౌలర్ శ్యామ్ కరణ్ మొదటి మ్యాచ్ కీ దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది  మరి ఈ రెండు జట్లలో ఏది విజయం సాధిస్తుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk

సంబంధిత వార్తలు: