ఐపీఎల్ లో ఎవ‌రెన్ని హ్య‌ట్రిక్స్ తీసారో తెలుసా?

Dabbeda Mohan Babu
క్రికెట్ చ‌రిత్ర‌లో ఐపీఎల్ పాత్ర చాలా ముఖ్య‌మైన‌ది. ఐపీఎల్ ద్వారా చాలా మంది యువ ఆట‌గాళ్లు త‌మ ప్ర‌తిభ‌ను చూపించారు. ఇప్ప‌టికే చాలా మంది యంగ్ ఆట‌గాళ్లు టీమిండియాలో స్థానం సాంధించారు. ఐపీఎల్ ను 2008 నుంచి బీసీసీఐ నిర్వ‌హిస్తుంది. అప్ప‌టి నుంచి ఐపీఎల్ లో అద్భుత మైన రికార్డ్స్ న‌మోదు అవుతున్నాయి. ఐపీఎల్ అంటే ప‌రుగుల వ‌రుద నే ఉంటుంది. అలాగే సిక్స్ ల సంఖ్య కూడా ఎక్కువ గానే ఉంటుంది. అలాగే ఐపీఎల్ చ‌రిత్ర‌లో హ్య‌ట్రీక్ వికెట్లు లు కూడా చాలానే ఉన్నాయి. మ‌న దేశానికి సంబంధించిన వారి తో పాటు విదేశి ఆట‌గాళ్లు కూడా ఐపీఎల్ లో హ్య‌ట్రీక్స్ తీశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 14 సిజ‌న్ ల‌లో ఐపీఎల్ మ్యాచ్ లు జ‌రిగియి. ఈ మ్యాచ్ ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 19 హ్య‌ట్రిక్ లు న‌మోద‌య్యాయి. అందులో మొట్ట మొద‌టి హ్య‌ట్రిక్ మాత్రం భార‌త స్పిన్ దిగ్గ‌జం అమిత్ మిశ్రా పేరిట ఉంది. ఐపీఎల్ మొద‌టి సిజ‌న్‌ 2008 లో నే అమిత్ మిశ్రా హ్య‌ట్రిక్ ను సాధించారు. అలాగే  ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ హ్య‌ట్ర‌క్ లు తీసిన రికార్డు కూడా  స్పిన్ బౌల‌ర్ అమిత్ మిశ్రా పేరునే ఉంది. ఇత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు హ్య‌ట్రిక్ వికెట్ల తీశాడు. మొద‌టగా 2008 లో ఢిల్లీ త‌రుపున అమిత్ మిశ్రా ఆడాడు. అప్పుడు ద‌క్కెన్ ఛార్జ‌ర్స్ కు చెందిన రవీంద్ర జాడేజా, ప్ర‌గ్యాన్ ఓజా, ఆర్‌పీ సింగ్ ఆట‌గాళ్ల‌ను వ‌రుస‌గా ఆవుట్ చేసి మొద‌టి హ్య‌ట్రిక్ సాధించాడు. అలాగే 2011లో ద‌క్కెన్ ఛార్జ‌ర్స్ త‌రుపున ఆడి పంజాబ్ కింగ్స్ కు చెందిన ఆవుట్ చేసి రెండో సారి హ్య‌ట్రిక్ సాధించాడు. అలాగే మూడో సారి 2013లో స‌న్ రైజ‌ర్స్ ఆట‌గాళ్ల‌ను వ‌రుస‌గా అవుట్ చేసి మూడో హ్య‌ట్ర‌కి్ ను న‌మోదు చేశాడు.

అలాగే ఒకే సిజ‌న్ లో రెండు హ్య‌ట్రిక్ సాధించిన ఘ‌న‌త ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ కు ద‌క్కుతుంది. యువ‌రాజ్ సింగ్ 2009 లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఆడాడు. అప్ప‌డు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూర్ పై హ్య‌ట్రిక్ సాధించాడు. త‌ర్వాత ద‌క్క‌న్ ఛార్జ‌ర్స్ పై రెండో హ్య‌ట్రిక్ ను న‌మోదు చేశాడు. అలాగే 2009లో రోహిత్ శ‌ర్మ‌,  2013లో సునీల్ న‌రైన్, 2016లో అక్ష‌ర్ ప‌టేల్ హ్య‌ట్రిక్  ల‌ను సాధించారు. అలా ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది ఆట‌గాళ్లు 19 సార్లు హ్య‌ట్రిక్ వికెట్లు తీసి రికార్డు న‌మోదు చేశారు. కాగ ప్ర‌స్తుతం 14 వ సిజిన్ న‌డుస్తుంది. దీనిలో ఎవ‌రు హ్య‌ట్రిక్ తీస్తారో వేచి చూద్దం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: