ఐపీఎల్ లో ఎవరెన్ని హ్యట్రిక్స్ తీసారో తెలుసా?
ఇప్పటి వరకు 14 సిజన్ లలో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగియి. ఈ మ్యాచ్ లలో ఇప్పటి వరకు 19 హ్యట్రిక్ లు నమోదయ్యాయి. అందులో మొట్ట మొదటి హ్యట్రిక్ మాత్రం భారత స్పిన్ దిగ్గజం అమిత్ మిశ్రా పేరిట ఉంది. ఐపీఎల్ మొదటి సిజన్ 2008 లో నే అమిత్ మిశ్రా హ్యట్రిక్ ను సాధించారు. అలాగే ఇప్పటి వరకు ఎక్కువ హ్యట్రక్ లు తీసిన రికార్డు కూడా స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రా పేరునే ఉంది. ఇతను ఇప్పటి వరకు మూడు సార్లు హ్యట్రిక్ వికెట్ల తీశాడు. మొదటగా 2008 లో ఢిల్లీ తరుపున అమిత్ మిశ్రా ఆడాడు. అప్పుడు దక్కెన్ ఛార్జర్స్ కు చెందిన రవీంద్ర జాడేజా, ప్రగ్యాన్ ఓజా, ఆర్పీ సింగ్ ఆటగాళ్లను వరుసగా ఆవుట్ చేసి మొదటి హ్యట్రిక్ సాధించాడు. అలాగే 2011లో దక్కెన్ ఛార్జర్స్ తరుపున ఆడి పంజాబ్ కింగ్స్ కు చెందిన ఆవుట్ చేసి రెండో సారి హ్యట్రిక్ సాధించాడు. అలాగే మూడో సారి 2013లో సన్ రైజర్స్ ఆటగాళ్లను వరుసగా అవుట్ చేసి మూడో హ్యట్రకి్ ను నమోదు చేశాడు.
అలాగే ఒకే సిజన్ లో రెండు హ్యట్రిక్ సాధించిన ఘనత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు దక్కుతుంది. యువరాజ్ సింగ్ 2009 లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. అప్పడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ పై హ్యట్రిక్ సాధించాడు. తర్వాత దక్కన్ ఛార్జర్స్ పై రెండో హ్యట్రిక్ ను నమోదు చేశాడు. అలాగే 2009లో రోహిత్ శర్మ, 2013లో సునీల్ నరైన్, 2016లో అక్షర్ పటేల్ హ్యట్రిక్ లను సాధించారు. అలా ఇప్పటి వరకు 14 మంది ఆటగాళ్లు 19 సార్లు హ్యట్రిక్ వికెట్లు తీసి రికార్డు నమోదు చేశారు. కాగ ప్రస్తుతం 14 వ సిజిన్ నడుస్తుంది. దీనిలో ఎవరు హ్యట్రిక్ తీస్తారో వేచి చూద్దం.