క్రికెట్ టీం ఇండియా త‌ర్వాతి కోచ్ ఎవ‌రంటే..?

Paloji Vinay
ప్ర‌పంచంలోని క్రికెట్ టీంల‌లో భార‌త్ అత్య‌త్త‌మంగా ఉంటుంది. అదే స్థాయిలో మ‌న దేశంలో క్రికెట్‌కు అభిమానులు చాలా ఎక్కువ‌. ప్ర‌స్తుతం ఉన్న ఇండియా క్రికెట్ టీం కోచ్ ర‌విశాస్త్రీ త్వ‌ర‌లోనే త‌న కోచ్ ప‌ద‌వికి గుడ్ బై చేప్ప‌నున్నాడ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ 20 ప్ర‌పంచ క‌ప్ అనంత‌రం ర‌విశాస్త్రీ ప‌ద‌వీ కాలం తీర‌నుంది. టీ 20 ప్ర‌పంచ క‌ప్ అనంత‌రం కోచ్‌గా కొన‌సాగేందుకు ర‌విశాస్త్రీ సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై బీసీసీఐ పెద్ద‌ల‌తో ర‌విశాస్త్రీ త‌న నిర్ణ‌యాన్ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ర‌వి నిర్ణ‌యంలో బీసీసీఐ కొత్త కోచ్‌ను వెతికే ప‌ని ప‌డింది.


    త్వ‌ర‌లోనే క్రికెట్ టీం ఇండియా కోచ్ ఎంపిక ప్ర‌క్రియ ప్రారంభించి ద‌ర‌ఖాస్తులు తీసుకోవాల‌ని బీసీసీఐ చూస్తోంద‌ని స‌మాచారం.  టీ20 ప్ర‌పంచ క‌ప్ ముగిసిన అనంత‌రం వెంట‌నే ర‌విశాస్త్రీ త‌న ప‌ద‌వికి రాజీనామ చేయ‌నున్నాడు ర‌విశాస్త్రీ. ఆయ‌న‌తో పాటు బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్‌.శ్రీ‌ధ‌ర్ కూడా త‌మ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్నారు. టీమిండియా ప్ర‌ధాన కోచ్‌గా ర‌విశాస్త్రిని నియ‌మించారు. 2019 ఆగ‌స్టులో ర‌వి శాస్త్రి ప‌ద‌వి కాలం ముగియ‌గా.. మ‌రో రెండేళ్ల ప‌ద‌వి కాలం పొడిగించింది బీసీసీఐ. దీంతో ఆయ‌న ప‌ద‌వికాలం టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత ముగియ‌నుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం ర‌విశాస్త్రీ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్నాడు.


     దీంతో బీసీసీఐ హెడ్ కోచ్‌ల నియ‌మ‌కానీకి నోటిఫికేష‌న్  జారీ చేసి, ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించి ఎంపిక చేయాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. కోచ్ రేసులో ఇప్ప‌టికే ప‌లువురి పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఇండియ‌న్ క్రికెట్ మాజీ కెప్పెన్ ది వాల్ రాహుల్ ద్ర‌విడ్ కోచ్ రేసులో ముందు వ‌రుస‌లో ఉన్నాడు. ఎన్ సీ ఏ డైరెక్ట‌ర్‌గా జూనియ‌ర్ టీమ్ కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన రాహుల్ ద్ర‌వీడ్‌కే కోచ్ ప‌ద‌వి వ‌రించ‌నున్న‌ట్టు అంచ‌నాలు ఉన్నాయి. అలాగే మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సేహ్వాగ్ కూడా  పోటీలో ఉన్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: