రోహిత్ వ‌ద్దు.. రాహుల్ లేదా పంత్ ఓకే - కోహ్లి?

Dabbeda Mohan Babu
ట్వీ ట్వంటి వ‌రల్డ్ క‌ప్ త‌ర్వాత ట్వంటీ ట్వంటి ల కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంట్టున్న‌ట్టు కోహ్లి ప్ర‌క‌టించ‌డంతో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వ‌న్డె లకు కాకుండ కేవ‌లం ట్వంటీ ట్వంటిల‌కే ఎందుకు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టు అనే అనుమాన‌లు అంద‌రికీ వ‌స్తున్నాయి. అంత‌ర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల‌లో కోహ్లి కి మంచి రికార్డే ఉంది. కోహ్లి 45 మ్యాచ్ ల‌కు సారథ్య‌వ వ‌హిస్తే దాదాపు 65 శాతం విజ‌యాల‌ను సాధించాడు. అన‌గా 27 విజ‌యాలు ఉన్నాయి. అందులో కేవ‌లం 14 ఓట‌ములు మాత్ర‌మే ఉన్నాయి. అంతే కాకుండా టీ 20 ల‌ల్లో ఎక్కువ ప‌రుగులు చేసినా కెప్టెన్ కూడా కోహ్లి కి రికార్డు ఉంది. అయినా కోహ్లి అంత‌ర్జాతీయ ట్వంటీ ట్వంటి మ్యాచ్ ల‌కు కెప్టెన్సీ ని వ‌దులుకున్నాడు.

ఇది ఇలా ఉండ‌గా కోహ్లి అంత‌ర్జాతీయ టీ 20 ల‌కు వీడ్కొల్ ప‌ల‌క‌డంతో త‌ర్వాత కెప్టెన్ గా ఎవ‌రు  ఉంటార‌ని ఉత్క‌ఠం ప్ర‌తి క్రికెట్ అభిమానికి నెల‌కొంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ ట్వంటీ ట్వంటి ల‌కు వైస్ కెప్టెన్ గా ఉన్న హిట్ మెన్ రోహిత్ శ‌ర్మ కు త‌ప్ప‌ని స‌రిగా ప్రమోష‌న్ వ‌చ్చిన‌ట్టే అని అనుకున్నారు. దాదాపు  హిట్ మెనే అంత‌ర్జాతీయ టీ 20 ల‌కు కెప్టెన్ అనుకున్నారు. అంతే కాకుండా హిట్ మ్యాన్ అభిమానులు సైతం సంబురాలు చేసుకున్నారు. అయితే రోహిత్ వ‌య‌స్సు ఈ నిర్ణ‌యానికి అడ్డు ప‌డేలా ఉంది. ప్ర‌స్తుతం రో హిత్ వ‌య‌స్సు దాదాపు గా 36 ఉంటుంది. ఇంకా మూడు నుంచి నాలుగు సంవ‌త్స‌రాలు మాత్ర‌మే టీమిండియా కు ఆడే ఆవ‌కాశాలు ఉన్నాయి. దీంతో రోహిత్ శ‌ర్మ ను కెప్టెన్ గా ఎంచుకోవాడానికి అవ‌కాశం త‌క్క‌వ అని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు.

అలాగే టీమిండియా మేనేజ్ మెంట్ కు కోన్ని స‌ల‌హాలు ఇచ్చార‌ని తెలుస్తోంది. అందులో కెప్టెన్ గురించి కూడా ఉంద‌ని స‌మాచారం.  అంత‌ర్జాతీయ టీ 20 ల‌కు కెప్టెన్ గా రోహిత్ కు బ‌దులు యంగ్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత‌ను సెలెక్ట్ చేయాల‌ని స‌ల‌హా ఇచ్చాడ‌ని తెలుస్తోంది. అలాగే రోహిత్ ను వైస్ కెప్టెన్ గా తొల‌గించి కేఎల్ రాహుల్ ను నియ‌మించాల‌ని సూచించాడ‌ని స‌మాచారం. రోహిత్ శ‌ర్మ‌కు రిట‌ర్మంట్ వ‌య‌స్సు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో యంగ్ ఆట‌గాళ్ల కు ఆవకాశం ఇవ్వాల‌ని కోహ్లి అన్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ సస్పెన్స్ కు తెర ప‌డాలంటే మ‌రి కొన్ని రోజులు ఓపిక ప‌ట్ట‌క త‌ప్ప‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: