కెప్టెన్‌గా విరాట్ కొహ్లి సక్సెస్ అయ్యాడా ? ఫెయిల్ అయ్యాడా ?

Veldandi Saikiran
విరాట్ కోహ్లీ.. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు నిన్న ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. టి20 ప్రపంచ కప్ అనంతరం విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పు కోవడాన్ని... కొంతమంది ఆహ్వానిస్తూ ఉంటే మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై అతని ఫ్యాన్స్ కూడా చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమందేమో విరాట్ కోహ్లీ చాలా తొందర పడ్డాడని మరి కొంతమందేమో సరైన సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. 

తన బ్యాటింగ్ పై ఫోకస్ చేసేందుకే  టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు విరాట్ కోహ్లీ.  విరాట్ కోహ్లీ తాజా నిర్ణయంపై... అందరిలోనూ ఓ ప్రశ్న తలెత్తుతోంది. నిజంగానా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా విఫలమయ్యారా ? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. అసలు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఏ మేరకు రాణించాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది.  తన కెరీర్ లో విరాట్ కోహ్లీ... మ్యాచులకు కెప్టెన్ గా పని చేశాడు. ఇక వీటిలో ఏకంగా 38 మ్యాచ్ లు గెలిచింది టీమిండియా. అలాగే  65 టెస్ట్ మ్యాచ్ ల్లో ఏకంగా 5 వేల ఆరు వందల అరవై ఏడు పరుగులు చేశాడు ఈ రన్ మిషన్ విరాట్ కోహ్లీ.  

అలాగే 20 శతకాలు సాధించాడు కోహ్లీ. ఇక వన్డేల విషయానికి వస్తే... 95 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ. ఇక ఇందులో లో భాగంగా 65 మ్యాచ్లు గెలిచింది టీమిండియా. ఈ వన్డే లా వ్యక్తిగత విషయానికి వస్తే... ఈ  95 మ్యాచ్ ల్లో  5499 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఇక ఈ 95 మ్యాచులలో ఏకంగా 21 శతకాలు సాధించాడు విరాట్ కోహ్లీ. అలాగే 20 మ్యాచ్ లో 45 మ్యాచులకు సారథిగా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ. ఇందులో లో లో 29 టి20 మ్యాచ్ లో గెలిచింది టీమ్ ఇండియా.  ఈ 29 మ్యాచ్లో పదిహేను వందల రెండు పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఇక రికార్డ్ ల ప్రకారం కోహ్లీ.. మంచి కెప్టెన్ గానే వ్యవహరించాడని.. విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: