శ్రేయస్ వచ్చినా కెప్టెన్ గా పంత్ కే ఓటు..

VAMSI
ఐపీఎల్ సీజన్ 14 సెకండ్ పేజ్ కు సర్వం సిద్దమయింది. ఇంకో మూడు రోజుల్లో ముంబై మరియు చెన్నై జట్ల మధ్యన జరిగే మ్యాచ్ తో మళ్ళీ ఇంకో కొన్ని రోజుల పాటు క్రికెట్ అభిమానులకు పండగే పండుగ. ఇప్పటికే ఎనిమిది జట్లు యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. కరోనా భయం లేకుండా బీసీసీఐ అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్ సెకండ్ పేజ్ కు కొన్ని దేశాల క్రికెటర్లు రావడం లేదన్నది తెలిసిన విషయమే. కారణాలు ఏమైనప్పటికీ ఇది ఆయా జట్లకు చాలా ఇబ్బంది అని చెప్పాలి. కొన్ని జట్లలో అయితే చాలా కీలకమైన ఆటగాళ్లు దూరమవుతున్నారు. ఇది ఆ జట్ల గెలుపు అవకాశాలను దెబ్బ తీసే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఇంగ్లాండ్ నుండి కొందరు ఆటగాళ్లు పాల్గొనడం లేదు. మరి  మ్యాచ్ జరిగే రోజుకి ఏమైనా శుభ వార్త వస్తుందేమో తెలియదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు గాయం కావడంతో ఐపీఎల్ మొదటి పేజ్ కు దూరమయ్యాడు. ఇతని స్థానంలో ప్రాంచైజీ ఎంతో నమ్మకంతో వికెట్ కీపర్ బాట్స్మన్ రిషబ్ పంత్ ను కెప్టెన్ గా నియమించింది. ప్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో ఆరింటిని గెలిపించి టీం ను పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిపాడు. అయితే అనూహ్యంగా సెకండ్ పేజ్ కు శ్రేయస్ అందుబాటులోకి రావడంతో కెప్టెన్ గా రిషబ్ నే కొనసాగించాలా లేదా శ్రేయస్ ను నియమించాలా అని అటు ఫ్రాంచైజీ ఇటు జట్టు కోచ్ పాంటింగ్ తికమకపడ్డారు.
అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కాసేపటి క్రితమే జట్టు యాజమాన్యం రిషబ్ పంత్ నే కెప్టెన్ గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం అని చెప్పవచ్చు. దూకుడు ఆలోచన కలిగిన రిషబ్ పంత్ ఖచ్చితంగా ఈ సారి ఐపీఎల్ టైటిల్ ను అందిస్తాడని నమ్మకంగా ఉన్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: